Telangana: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా..! ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను గెంటేశారు..!
కాలం మారుతుందంటే ఇదేనేమో.. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయనడానికి ఇదే మచ్చు తునక. అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు అనే నానుడి నిజమవుతోంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నా బిడ్డలు తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. ఆస్తిని తీసుకుని కడుపున మోసి, కని పెంచిన కన్నతల్లిని కొడుకులు ఇంటి నుండి గెంటేశారు.

కాలం మారుతుందంటే ఇదేనేమో.. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయనడానికి ఇదే మచ్చు తునక. అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు అనే నానుడి నిజమవుతోంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నా బిడ్డలు తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. ఆస్తిని తీసుకుని కడుపున మోసి, కని పెంచిన కన్నతల్లిని కొడుకులు ఇంటి నుండి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంకు చెందిన ముట్టెని వెంకయ్య, రత్నమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి వెంకటయ్య చనిపోయాడు. దీంతో తల్లి రత్నమ్మ ఎన్నో అష్టకష్టాలు పడి పిల్లలను పెంచి పెళ్లిళ్లు చేసింది. ఇద్దరు కొడుకులు కూడా గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి సంపాదించిన ఆరు ఎకరాల భూమి, తల్లి కష్టపడి కట్టుకున్న ఇంటిని కొడుకులిద్దరూ సమానంగా పంచుకున్నారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మాత్రం పట్టించుకోవడం లేదు.
కొడుకులు తల్లిని తమ ఇంట్లోకి రానివ్వకుండా అన్నం పెట్టకుండా వేధిస్తున్నారు. కొడుకులిద్దరూ ఇంటి నుండి గెంటేయడంతో వృద్ధురాలు రత్నమ్మ బాధను చూసి చుట్టుపక్కల వారు కొద్ది రోజులు ఆహారం పెట్టారు. గ్రామస్తులు తల్లికి ఆహారం పెడుతున్న కొడుకులు మాత్రం పట్టించుకోలేదు. గత్యంతరం లేక పొరుగు గ్రామంలో ఉన్న కూతురు వద్ద రత్నమ్మ తల దాచుకుంటుంది. తన ఆస్తిని తీసుకుని గెంటేసిన కొడుకుల నుండి తనకు న్యాయం చేయాలంటూ వృద్ధురాలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ కోసం ఇద్దరు కొడుకులకు నోటీసులు పంపించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
