AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం, బుధవారం పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అబ్బ.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2026 | 8:32 PM

Share

ఎండలు.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం (02-06-2026) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

02 జూన్, మంగళవారం

పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో 43.6డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.2, పల్నాడు జిల్లా మాచర్లలో 41.5, నంద్యాల జిల్లా సంజామల, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో సైతం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!