నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది : బుచ్చిబాబు
మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది టెన్షన్ గా ఉంది. న చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఉప్పెన తర్వాత ఐదేళ్ల తర్వాత సినిమా చేశా.. ఉప్పెనకు అవార్డు వచ్చింది.. ఇన్నేళ్లు ఎందుకు టైం తీసుకున్నా అంటే పెద్ది కోసమే తీసుకున్నా.. ఉప్పెన స్టోరీ ఇక్కడ విజయవాడలోనే రాశా.. ఉప్పెన తర్వాత ఎవరితో చేయాలా అనుకుంటున్నపుడు సుకుమార్ చరణ్ గారికి పరిచయం చేశారు.. దేవుడికి దండం పెట్టుకొని చరణ్ కు స్టోరీ చెప్పా..
పెద్ది కమర్షియల్ సినిమా కాదు.. ఇది ఎమోషనల్ మూవీ, ఒక ఆటగాడి సినిమా.. ఒక ఆట ఎలాంటి గుర్తింపు తెస్తుంది అనేది చూపిస్తుంది.. ఈ జర్నీలో చరణ్ గారితో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి.. రెండో సినిమాకే మీలాంటి స్టార్ ఇవ్వడం మాములు విషయం కాదు.. నా కథను నమ్మారు.. ఓ నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే అర్ధమవుతుంది. క్లైమాక్స్ చూసినప్పుడల్లా నాకళ్ళ వెంట నీళ్ళలొచ్చాయ్.. చాలా మంది అదే చెప్పారు. లాస్ట్ 40నిముషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుంది.. సినిమా జూన్ 4న విడుదలవుతుంది ఫ్యామిలీతో వెళ్లి చూడండి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ సినిమాలో చూస్తారు. నన్ను నమ్మినందుకు మిమ్మల్ని ఎప్పడూ మర్చిపోలేను.. జీవితంలో రుణపడి ఉంటా.. జానీ నటనలో హీరోయిజం ఉంటుంది.. క్లైమాక్స్ లో జాన్వీ నటన అద్భుతంగా ఉంటుంది.
రెహమాన్ గారు అందించిన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి.. ఈ సినిమాకు రెహమాన్ గారు మ్యూజిక్ చేయడం అనేది నా చిరకాల కోరిక అది పెద్దితో నెరవేరింది. రామ్ చరణ్ సార్.. మీరు లేకపోతే నేను లేను..అంటూ ఎమోషనల్ అయ్యారు బుచ్చిబాబు. ఫ్యామిలీతో సినిమాచూడండి.. పెద్దితో ఆడతారు, పాడతారు.. పెద్ది మీవెంట వస్తాడు.. చరణ్ గారి నటన చూస్తే మీకు కన్నీళ్లు కచ్చితంగా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.
