AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్.. ఎక్కడంటే..?

జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లైఓవర్లు ఉండగా.. ట్రాఫిక్ రద్దీని మరింత తగ్గించడంలో భాగంగా ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి రెడీ అయింది. త్వరలోనే భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్.. ఎక్కడంటే..?
Flyover
Venkatrao Lella
|

Updated on: Jun 01, 2026 | 6:23 PM

Share

హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈ  ఫ్లైఓవర్ ఎక్కడ..? ఏంటి?  అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వం నుంచి అనుమతి

ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్‌కు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. గాయత్రి నగర్, టీకేఆర్ కాలేజీ, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా దీని నిర్మాణం జరపాలని అధికారులు ప్రణాళికలు రచించారు. దాదాపు రూ.416 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద ఈ పనులు చేపట్టనుండగా.. ఇంజినీరింగ్, ప్రొక్యూఆర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ విధవానంలో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. త్వరలోనే భూసేకరణతో పాటు యుటిలిటీ షిప్టింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే బడంగ్ పేట్, అల్మాస్ గూడ, మీరే పేట ప్రాంతాలకు కనెక్టివిటీ లభించనుంది. ఇక ఎల్బీనగర్ నుంచి సంతోష్ నగర్ మీదుగా పాతబస్తీ వైపు వెళ్లే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ వల్ల ప్రయోజనం చేకూరనుంది. బడంగ్ పేట, మీర్ పేట, అల్మాస్ గూడ ప్రాంతాల్లో జనాభా గత కొన్నేళ్లల్లో భారీగా పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్య ఆయా ప్రాంతాల్లో ఏక్కువ ఏర్పడుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు జర్నీ తగ్గనుంది.

త్వరలోనే భూసేకరణ

హైదరాబాద్‌లోని తూర్పు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఈ ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ వల్ల తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. దశలవారీగా ప్రాజెక్టులు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమైంది. ఇప్పటకే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులను చేపట్టనుందని తెలుస్తోంది.

Follow Us