AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. మహిళలందరికీ తప్పనున్న కష్టాలు..

మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డులకు అందించేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఫ్రీ టికెట్ జారీ చేస్తున్నారు. కానీ ఇకపై స్మార్ట్ కార్డ్ చూపిస్తే కండక్టర్లు టికెట్లు జారీ చేయనున్నారు.

Telangana: మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. మహిళలందరికీ తప్పనున్న కష్టాలు..
Free Bus
Venkatrao Lella
|

Updated on: Jun 01, 2026 | 9:56 PM

Share

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆధార్ కార్డుతో అవసరం లేకుండా ప్రత్యేక కార్డును తెలంగాణ ప్రభుత్వం జారీ చేసేందుకు సిద్దమైంది. ఈ నెల నుంచే ఈ కార్డును మహిళలకు పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాలు సేకరించారు. వారికి ఉచితంగా ఈ కార్డులను అందించనున్నారు. దీంతో ఈ కార్డు చూపించి సులువుగా ఆర్టీసీ బస్సు్లో ఫ్రీ జర్నీ చేయవచ్చు.

స్మార్ట్ కార్డుతో లాభాలెన్నో..

చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు ఇవ్వనున్నారు. ఏటీఎం కార్డు తరహాలో ఇది ఉంటుంది. మహిళల ఆధార్ కార్డు వివరాలు, ఫొటో సేకరించి చిప్‌తో అనుసంధానం చేస్తారు. అనంతరం స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. బస్ పాసుల తరహాలో వీటిని చూపించి మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ముందుగా ఒక డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టు తరహాలో స్మార్ట్ కార్డులు మహిళలకు జారీ చేయనున్నారు. అనంతరం వాటిల్లో వచ్చే సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నారు. జూన్‌లో వీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ కార్డులతో జారీపై అవసరమైన నిధులను ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీకి అందించింది. దీంతో స్మార్ట్ కార్డుల తయారీకి ఆర్టీసీ సిద్దమవుతోంది. కాగా మహాలక్ష్మి పథకం డిసెంబర్ 9,2023లో ప్రారంభించారు. ఈ పథకం వచ్చాక బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతీ బస్సులో 65 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇక బస్సుల్లో ఆక్సుపెన్సీ రేషియో కూడా పెరిగిపోయింది. గతంలో 70 శాతం మాత్రమే ఉండగా.. ఇది వచ్చాక 120 శాతానికి పెరిగింది.

Follow Us