మధురమైన మామిడి పండ్లను గుర్తించే 9 సీక్రెట్ టిప్స్!
01 jun 2026
Anand T
చాలామంది మామిడి పండు రంగు చూసి అది తీపిగా ఉంటుందని అనుకుంటారు. కానీ కేవలం రంగు ఆధారంగానే మామిడి పండు నాణ్యతను, తీపిని అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండు తియ్యగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు దాని సువాసన చక్కగా ఉపయోగపడుతుంది. పండు తొడిమ పైభాగం దగ్గర వాసన చూసినప్పుడు సహజమైన, తీపి సువాసన వస్తే అది బాగా పండినట్లు అర్థం.
ఒకవేళ తొడిమ నుంచి నుండి ఎలాంటి వాసన రాకపోయినా, లేదా కాస్త పుల్లటి వాసన వచ్చినా అది సరిగ్గా పండలేదని అర్థం అలాంటి వాటిని తీసుకోకండి.
మామిడి పండును వేళ్లతో తేలికగా నొక్కి కూడా పండు పండిందా లేదా అని తెలుసుకోవచ్చు. బాగా పండిన తీపి మామిడి పండు కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది.
మీరు నొక్కినప్పుడు పండు మరీ గట్టిగా ఉంటే అది పచ్చిగా ఉందని, అలా కాకుండా మరీ ఎక్కువగా మెత్తగా ఉంటే అది లోపల కుళ్ళిపోయి ఉండే అవకాశం ఉందని అర్థం.
ఒకే సైజులో ఉన్న రెండు మామిడి పండ్లను చేతుల్లోకి తీసుకుని చూడండి. వాటిలో ఏ పండు ఎక్కువ బరువుగా అనిపిస్తుందో, అందులో రసం ఎక్కువగా ఉండి, మరింత రుచిగా, తీపిగా ఉంటుంది.
పూర్తిగా మెరిసిపోయే మామిడి పండ్ల కంటే, సహజంగా పండిన మామిడి పండ్ల తొక్కపై స్వల్పంగా ముడతలు లేదా సహజమైన మచ్చలు కనిపిస్తాయి. ఇవి పండు తీపికి సంకేతం.
మామిడి పండు కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, విటమిన్ E తో పాటు శరీరానికి కావలసిన ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.