30 రోజులు అన్నం, రోటీ లేకుండా ఉంటే ఏమవుతుంది?

10  march 2026

Jyothi Gadda

బరువు తగ్గే అవకాశం: అన్నం, రోటీ వంటి కార్బోహైడ్రేట్లు తగ్గితే శరీరంలో క్యాలరీలు తక్కువగా చేరతాయి. దీంతో కొంతమంది వ్యక్తుల్లో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

 శరీరంలో కొవ్వు కరిగే అవకాశం: కార్బ్స్ తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం నిల్వలో ఉన్న కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఫ్యాట్ తగ్గవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావచ్చు: అన్నం, రోటీ తీసుకోవడం తగ్గితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కొంతవరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది.

మొదటి రోజుల్లో అలసట: ప్రారంభంలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందకపోవడంతో కొంత అలసట, బలహీనత అనిపించవచ్చు.

ఆకలి తగ్గడం: కొన్ని రోజుల తర్వాత శరీరం కొత్త ఆహార విధానానికి అలవాటు పడుతుంది. దీంతో ఆకలి కొంతవరకు తగ్గినట్లు అనిపించవచ్చు.

జీర్ణక్రియలో మార్పులు: ఆహారపు అలవాట్లు మారడంతో జీర్ణక్రియలో కూడా కొంత మార్పు కనిపించవచ్చు.

శక్తి స్థాయిల్లో మార్పు: కొంతమందికి శరీరం కొవ్వును శక్తిగా ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ఎనర్జీ స్థాయి స్థిరంగా ఉండొచ్చు.

 మెటాబాలిజం మార్పులు: ఆహారంలో పెద్ద మార్పు రావడంతో మెటాబాలిజం విధానంలో కూడా కొంత మార్పు జరుగుతుంది.