ఉసిరికాయ పల్లి చట్నీ ఇలా చేసి తింటే.. చికెన్, మటన్ ఏ మూలకి రావు

Prasanna Yadla

10  March 2026

Pic credit - Pixabay

ఉసిరికాయ పల్లి చట్నీ ఇలా  చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

ఉసిరికాయ పల్లి చట్నీ

మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుకుందాం.. 

ఉసిరికాయ పల్లి చట్నీ

4 ఉసిరికాయలు, ఒక కప్పు పల్లీలు, 4 వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొత్తిమీర, జీలకర్ర , 4 పచ్చిమిర్చి, ఉప్పు, నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా పల్లీలను వేయించి చల్లారిన తర్వాత వీటిని పొత్తు తీసి పక్కన ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ -1

ఆ తర్వాత ఉసిరికాయలను  ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి గింజలు మాత్రం తీసేయండి.

స్టెప్ -2

రోటిలో కానీ, మిక్సీలో కానీ ఉసిరికాయ ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. 

స్టెప్ -3

ఆ తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర ఆకులు, అర టీ స్పూన్ ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్ చేయండి.

స్టెప్ -4

ఉసిరికాయ పల్లి చట్నీ ఇలా  చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

ఉసిరికాయ పల్లి చట్నీ