IPL 2026 షెడ్యూల్‌పై షాకింగ్ అప్డేట్.. తొలుత 20 మ్యాచ్‌లేనంట.. ఆ తర్వాత..?
ఐపీఎల్ (IPL 2026) షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకుండా, మొదటి కొన్ని రోజుల మ్యాచ్‌లను మాత్రమే ప్రకటించనుంది. దీనికి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఐపీఎల్ (Indian Premier League) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే IPL 2026 ప్రారంభ తేదీ మార్చి 28గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తి షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతుందన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది. బీసీసీఐ (Board of Control for Cricket in India) (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) ప్రకారం, IPL 2026 షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు. అయితే అన్ని మ్యాచ్‌ల తేదీలను ఒకేసారి వెల్లడించబోరని స్పష్టం చేశారు.
మొదట 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే..
బీసీసీఐ ప్రకటన ప్రకారం మొదట మొదటి 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయనున్నారు. ఆ తరువాతి మ్యాచ్‌ల తేదీలను టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ప్రకటించనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలేనని తెలుస్తోంది. ఎన్నికల తేదీల ప్రకారం మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు అవసరం కావచ్చని బీసీసీఐ భావిస్తోంది.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
ఎన్నికల కారణంగా షెడ్యూల్ ఆలస్యం..
ఐపీఎల్ (IPL 2026) సమయంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించబడలేదు. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికల తేదీలను పరిగణలోకి తీసుకొని తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇప్పటికే ప్రారంభమైన జట్లు..
IPL 2026 కోసం అన్ని 10 జట్లు ఇప్పటికే తమ శిక్షణ శిబిరాలను ప్రారంభించాయి. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు చెన్నైలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. అలాగే పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ధర్మశాలలో తమ క్యాంప్ నిర్వహిస్తోంది.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
ఇక రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా గత నెల చివరి వారంలోనే తమ శిక్షణను ప్రారంభించింది. జట్లు ఇప్పటికే టైటిల్ కోసం తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.
గత సీజన్ ఫైనలిస్టులతో ఓపెనింగ్ మ్యాచ్?
సాధారణంగా IPL ప్రారంభ మ్యాచ్ గత సీజన్ ఫైనలిస్టుల మధ్య కాకుండా ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా ప్రారంభ మ్యాచ్‌లో ఆ జట్టు ఉండే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా కొద్దిరోజులు వేచి చూడాల్సి ఉంటుంది.
IPL ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో ఒకటి. IPL 2026 షెడ్యూల్ పూర్తిగా ప్రకటించకపోయినా, టోర్నమెంట్ ప్రారంభం కోసం అభిమానులు ఇప్పటికే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల పరిస్థితుల మధ్య కూడా ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని అంచనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
