- Telugu News Photo Gallery Relationships: Warning signs and risk factors for emotional distress between Wife and Husband
Relationship Tips: భార్యాభర్తలు ఈ విషయాల్లో అలర్ట్‌గా ఉండడం మంచిది.. లేకపోతే కొంపలో కుంపటే..
ప్రస్తుత కాలంలో బంధాలు బలహీనంగా మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలతో ప్రారంభయ్యే గొడవలు.. బంధాన్ని తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తున్నాయి. దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో చాలామంది విడాకుల వరకు వెళ్తున్నారు.
Updated on: May 30, 2023 | 1:08 PM

ప్రస్తుత కాలంలో బంధాలు బలహీనంగా మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలతో ప్రారంభయ్యే గొడవలు.. బంధాన్ని తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తున్నాయి. దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో చాలామంది విడాకుల వరకు వెళ్తున్నారు. వైవాహిక జీవితంలో ప్రేమ, నమ్మకం, అర్ధం చేసుకునే స్వభావం ఇద్దరికీ ఉండటం ముఖ్యం.. అయితే, కొన్ని విషయాలు సంబంధంలో భావోద్వేగ ప్రమాదాన్ని సృష్టిస్తాయని.. అలాంటి వాటితో అప్రమత్తంగా ఉండాలంటున్నారు మానసిక నిపుణులు..

ఏదైనా సంబంధంలో స్పష్టమైన అంచనాలను కలిగి ఉండటం ముఖ్యం. రొమాంటిక్ అయితే పర్వాలేదు. కానీ.. నెరవేరని అంచనాలు సంబంధంలో ప్రతికూలత వాతావరణాన్ని సృష్టించడంతోపాటు.. భావోద్వేగ ప్రమాదానికి దారితీస్తాయి. భావోద్వేగ ప్రశ్నలు.. బంధుత్వంలో అడ్డంకిగా మారుతాయి.. అవేంటో తెలుసుకోండి..

ఆరోగ్యకరమైన సంబంధాలు భిన్నమైన అభిప్రాయాలను కలిగిస్తాయి. వాస్తవానికి, అన్ని సంబంధాలలో వాదనలు జరుగుతాయి. భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉన్నందుకు సంబంధంలో బయటి వ్యక్తిగా భావించడం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అవసరం..

విశ్వాసం, మద్దతు భాగస్వామ్యానికి పునాదిగా ఉండాలి. మీ వెనుక మీ గురించి ప్రతికూలంగా మాట్లాడటం.. సంబంధంపై తీవ్రమైన సంభాషణలకు దారితీస్తాయి. ఇవి రాజీ పడకూడని విధంగా అంతరాలు సృష్టిస్తాయి.

ముఖ్యంగా మీ తప్పులకు బాధ్యత వహించడం ముఖ్యం. మీరు మీ భాగస్వామి మధ్య సంబంధాన్ని లేదా స్నేహాన్ని గౌరవించుకోవడం మంచిది. ఇది మంచి పద్దతి కూడా.. అయితే, మీరు మీ జవాబుదారీతనాన్ని పదేపదే తప్పించుకుంటే అది సంబంధానికి అనారోగ్యకరం. ఇది ఎన్నో అపోహలకు దారి తీస్తుంది.

అవతలి వ్యక్తిని సంతోషపెట్టడానికి మీ స్వంత అవసరాలు, అంచనాలను త్యాగం చేయడం అనారోగ్య సంబంధానికి సంకేతం. ప్రతి సంబంధంలో సమాన లావాదేవీలు ఉండాలి.. ఇచ్చిపుచ్చుకునే విధానం.. గౌరవించుకునే విధానం ఉండాలి.





























