- Telugu News Photo Gallery Cinema photos samantha ruth prabhu shaakuntalam wins best indian film at cannes 2023
Shaakuntalam: సినిమా ఫ్లాప్ అయినా సత్తా చాటింది.. ఇంటర్నేషనల్ అవార్డ్‌లతో అదరగొట్టిన శాకుంతలం
శాకుంతలం! దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌నే షాక్ చేసిన ఫిల్మ్! సమంత లాటి స్టార్ హీరోయిన్‌నే సైలెంట్ అయ్యేలా చేసిన ఫిల్మ్! గుణ శేఖర్ లాంటి ట్యాంలెంట్ డైరెక్టర్‌నే తలపట్టుకునేలా చేసిన ఫిల్మ్ !
Updated on: May 30, 2023 | 1:06 PM

శాకుంతలం.. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌నే షాక్ చేసిన ఫిల్మ్! సమంతలాంటి స్టార్ హీరోయిన్‌నే సైలెంట్ అయ్యేలా చేసిన ఫిల్మ్ ఇది.

గుణ శేఖర్ లాంటి ట్యాంలెంట్ డైరెక్టర్‌నే తలపట్టుకునేలా చేసిన ఫిల్మ్ ! తెలుగు ఆడియెన్స్ చూసేందుకు నిరాకరించిన ఫిల్మ్ గా మారింది శాకుంతలం.

అలాంటి ఈ సినిమా తాజాగా ఇంటర్నేషన్ అవార్డ్ వచ్చేలా చేసుకుంది. ఏకంగా కేన్స్‌లోనే విపరీతంగా బజ్ అయింది. దాంతో చిత్రయూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సమంత, దేవ్ మోహన్ కీ రోల్లో .. భారీ బడ్జెట్‌తో... పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన శాకుంతలం సినిమా.. థియేటర్లలో రెస్పాన్స్ రాబట్టుకోలేక పోయింది.

ఒక్క గ్రాఫిక్స్ అప్ టూ ది మార్క్ లేదనే కామెంట్ మనిహా..! తెలిసిన కథను మరీ తెలిసినట్టే తీశారనే మాట మినహా...! మిగిలిన అన్ని విభాగాల్లో అందర్నీ ఆకట్టుకుంది ఈ సినిమా..

అలాంటి ఈ సినిమా తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అదరగొట్టింది. సమంతతో పాటు.. కీ రోల్ చేసిన క్యారెక్టర్స్ క్యాస్టూమ్స్ విషయంలో జ్యూరీని ఫిదా చేసింది.

దీంతో ఈ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైర్ కాటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. ఈ మూవీ ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన నీతూ లుల్లాను.. కేన్స్ అవార్డ్ వరించింది.

ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల అవుతోంది. థియేటర్లలో ఫెయిల్ అయినా.. కేన్స్ లో అదరగొట్టిందనే కామెట్ నెట్టింట నుంచి వచ్చేలా చేసుకుంటోంది.





























