- Telugu News Photo Gallery Physical Relationship Tips: do not make this mistake while making a physical relationship
Relationship Tips: ఫిజికల్ రిలేషన్‌లో ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులే..
Relationship Tips: వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు లేనిపోని గొడవలకు దారితీస్తాయి. అందుకే.. భార్యభర్తలిద్దరూ ఆచితూచి వ్యవహరించాలి. బంధాన్ని బలంగా మార్చుకోవడం కోసం.. ఇద్దరూ ప్రేమ, ఆప్యాయత, నమ్మకంతో మెలగాలి.
Updated on: Jun 10, 2023 | 8:53 PM

వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు లేనిపోని గొడవలకు దారితీస్తాయి. అందుకే.. భార్యభర్తలిద్దరూ ఆచితూచి వ్యవహరించాలి. బంధాన్ని బలంగా మార్చుకోవడం కోసం.. ఇద్దరూ ప్రేమ, ఆప్యాయత, నమ్మకంతో మెలగాలి. అయితే.. శారీరక సంబంధం అనేది రెండు వేర్వేరు శరీరాలను ఏకం చేసే ప్రక్రియ. అయితే, ఇది కూడా రెండు మనసుల కలయికతో ముడిపడి ఉండే అంశం.. అటువంటి పరిస్థితిలో భాగస్వాములిద్దరూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఫిజికల్ రిలేషన్ లో ఉన్నప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మూడ్ ఆఫ్ అవుతుంది. సెక్స్ సమయంలో మీ భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం.. అయితే ఈ సమయంలో తగిన లేదా అనుకూలంగా లేని కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది మీ సంబంధాన్ని చెడగొడతాయి. శారీరక సంబంధం సమయంలో చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.

తీవ్రమైన విషయంః ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విషయాలు, పని ఒత్తిడి వంటి తీవ్రమైన లేదా అనసవర విషయాలను చర్చించడానికి ఇది సాధారణంగా సమయం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ చర్చలు చిరాకును తెప్పిస్తాయి.. మూడ్ ఆఫ్‌కు కారణమవుతాయి.. కావున వీటికి దూరంగా ఉండండి.

విమర్శ లేదా ప్రతికూల అభిప్రాయంః శారీరక సంబంధం సమయంలో భాగస్వామితో సరదా సంభాషణలు, ఇష్టా ఇష్టాలను పంచుకోవడం మంచిదే.. కానీ ఆ సమయంలో విమర్శించడం లేదా ప్రతికూల అభిప్రాయాన్ని ఇవ్వడం మీ భాగస్వామి ఆత్మగౌరవానికి హానికరంగా మారుతుంది.

గత సంబంధాలు లేదా లైంగిక అనుభవాలుః ఫిజికల్ రిలేషన్‌లో గత సంబంధాలు లేదా లైంగిక అనుభవాలను తీసుకురావడం వల్ల మీ భాగస్వామి అసౌకర్యంగా లేదా అసురక్షితంగా భావిస్తారు. మీరు మీ భాగస్వామితో మీ ప్రస్తుత అనుభవంపై దృష్టి పెట్టడం ముఖ్యం.. ఇలాంటి విషయాల్లో ఇతరులతో పోల్చవద్దు.

భవిష్యత్తు ప్రణాళికలు లేదా బాధ్యతలుః భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం ముఖ్యం.. కానీ శారీరక సంబంధం సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు లేదా బాధ్యతల గురించి చర్చించడం అనేది పరధ్యానంగా ఉంటుంది.. ఇది ఇద్దరిలో మూడ్ ఆఫ్ కు కారణమవుతుంది.





























