Virat Kohli: కింగ్ కోహ్లీ ఖాతాలో మరికొన్ని రికార్డులు.. సచిన్ తర్వాత ఆ ఘనత అందుకున్న బ్యాటర్‌గా..
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 2000 పరుగులు పూర్తి చేసిన ఐదవ భారత ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. విరాట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (3630), వీవీఎస్ లక్ష్మణ్ (2434), రాహుల్ ద్రవిడ్ (2143), చేతేశ్వర్ పుజారా (2033)లు ఈ ఘనత అందుకున్నారు.