Spondylitis: ఆ నొప్పి భరించలేకపోతున్నారా? అయితే బాబా రామ్ దేవ్ చెబుతున్న ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

యోగాలో దీనికి చక్కని పరిష్కారం దొరకుతుందని బాబా రాందేవ్ సూచిస్తున్నారు. కొన్ని యోగాసనాల ద్వారా యాంకిలోసింగ్ స్పాండిలైటిస్ నొప్పి నుంచి విడుదల పొందవచ్చని చెబుతున్నారు. ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Spondylitis: ఆ నొప్పి భరించలేకపోతున్నారా? అయితే బాబా రామ్ దేవ్ చెబుతున్న ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Spondylitis
Follow us
Madhu

|

Updated on: Feb 04, 2023 | 3:49 PM

ఇటీవల కాలంలో ఎక్కువ వినిపిస్తున్న వ్యాధి పేరు స్పాండి లైటిస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే మెడనొప్పి. సెల్ ఫోన్లు ఎక్కువగా వినియోగించే వారు.. ఒకేచోట కూర్చొని, కదలకుండా డెస్క్ జాబ్ చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అధిక చలి వాతావరణం కూడా ఈ స్పాండిలైటిస్ కొంత కారణం కావచ్చు. ఇది ఇన్ ఫ్లమేటరీ వ్యాధి, దీర్ఘకాలంలో ఇది వెన్నెముకకు కనెక్ట్ అయి ఉన్న ఇతర ఎముకల స్థితిని దెబ్బతీసి, వెన్నెముక సక్రమంగా పనిచేయలేని స్థితికి తీసుకెళ్తుంది. ఫలితంగా మెడ నుంచి కిందకు విపరీతమైన నొప్పి వస్తుంది. వెన్నెముక వంగిపోతుంది. ఈ పరిస్థితిని యాంకిలోసింగ్ స్పాండిలైటిస్ అంటారు. దీని వల్ల కలిగే నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. దానికి భరించలేక చాలా మంది సాధారణ పెయిన్ కిల్లర్స్ వినియోగిస్తూ ఉంటారు. అవి కూడా దీర్ఘకాలంలో చాలా సమస్యలను తీసుకొస్తుంది. అయితే మరేమి చేయాలి? ప్రత్నామ్నాయ చికిత్సలు, దీర్ఘకాలంలో ఎటువంటి సైడ్ ఎఫెక్స్ లేని విధానాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు బాబా రాందేవ్ చక్కని సమాధానాలు ఇస్తున్నారు. యోగాలో దీనికి చక్కని పరిష్కారం దొరకుతుందని సూచిస్తున్నారు. కొన్ని యోగాసనాల ద్వారా యాంకిలోసింగ్ స్పాండిలైటిస్ నొప్పి నుంచి విడుదల పొందవచ్చని చెబుతున్నారు. ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్పాండిలైటిస్ లక్షణాలు ఇవి..

యాంకిలోసింగ్ స్పాండిలైటిస్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు మీకు కనిపస్తాయి. దిగువ వీపు భాగం, హిప్స్, మెడ భాగాల్లో విపరీతమైన నొప్పి, నిస్సత్తువ వేధిస్తుంటాయి. అలాగే అలసట, కండరాల నొప్పులు, కంటి వాపు, కీళ్ల నొప్పి, మెడ, వెన్ను నొప్పి, చేతులు, కాళ్ళలో వాపు మీకు కనిపిస్తాయి. స్పాండిలైటిస్ కారణంగా పలు ఇతర రోగాలు కూడా మిమ్మల్ని చుట్టముడతాయి. వాటిల్లో స్లిప్ డిస్క్ సయాటికా , వెర్టిగో, మైగ్రేన్, నాడీ వ్యవస్థపై ఇతర ప్రభావాలు ప్రధానంగా వచ్చే అవకాశాలున్నాయి.

స్పాండిలైటిస్ కోసం యోగా..

స్పాండిలైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే కొన్ని యోగాసనాలు ఇవి.. పిల్లల భంగిమ, వంతెన భంగిమ, నాగుపాము భంగిమ, మిడతల భంగిమ, పర్వత భంగిమ, పిల్లి భంగిమ, ఆవు భంగిమ, సిబ్బంది భంగిమ.

ఇవి కూడా చదవండి

సయాటికా నొప్పికి ఇంటి చిట్కాలు..

  • వేడి పాలలో పసుపు, తేనే కలుపుకొని తాగాలి.
  • నొప్పి ఉన్న చోట పసుపు, కొబ్బరి నూనెనె కలిపి రాయాలి.
  • అల్లం టీని తేనెతో తాగాలి.
  • నువ్వుల నూనెతో వీపు భాగాన్ని మసాజ్ చేయాలి.

మరికొన్ని ఇతర చిట్కాలు..

  • కూర్చున్నప్పుడు మెడ నిటారుగా ఉంచాలి.
  • మెత్తని పరుపుకు బదులుగా మంచం మీద పడుకోండి.
  • విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.
  • ధూమపానం-మద్యపానం వీలైనంత వరకూ దూరం పెట్టాలి.
  • మెడ నొప్పి నివారణకు రోజూ యోగా చేయాలి.
  • మీ ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయవద్దు. పని చేసేటప్పుడు డెస్క్ లేదా టేబుల్ ను తప్పనిసరిగి వినియోగించాలి.
  • మీ వీపును నిటారుగా ఉంచండి, మీ భుజాలను వంచకండి.
  • ప్రతి గంటకు కనీసం ఓ ఐదు నిమిషాలు విరామం తీసుకోండి.
  • క్రమతప్పకుండా వ్యాయామం చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..