5 మినిట్స్‎లో గులాబ్ జామూన్ మిక్స్ వాడకుండా ఇలా ఈజీగా చేసేయండి 

Prasanna Yadla

26 February 2026

Pic credit - Pixabay

 గులాబ్ జామూన్ చేయాలంటే కచ్చితంగా మిక్స్ వాడాల్సిందే అని చాలా మంది అనుకుంటారు కానీ, అది లేకుండా 5 మినిట్స్‎లో స్పాంజి లాగా తయారు చేసుకోవచ్చు.

 గులాబ్ జామూన్

 గులాబ్ జామూన్ చేయడానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

 గులాబ్ జామూన్

 మిల్క్ పౌడర్, మైదా పిండి, పంచదార, నెయ్యి, బేకింగ్ సోడా, పాలు, నూనె, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో చక్కెర, ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా మరగబెట్టాలి. మరి పాకం లాగా కాకుండా ఉండేలా చూసుకోండి.  

స్టెప్ -1 

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మిల్క్ పౌడర్, మైదా పిండి, కొద్దిగా బేకింగ్ సోడా, నెయ్యి వేసి బాగా మిక్స్ అయ్యేలా గరిటెతో కలపాలి. 

స్టెప్ -2

చివర్లో కొద్దిగా పాలు పోసి పిండిలా మారే వరకు స్టవ్ మీదే ఉంచి దానిని మెల్లిగా కలుపుతూ ఉండాలి.

స్టెప్ -3

ఇక ఇప్పుడు కొంచం నూనె చేతులకు రాసుకుని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని నెయ్యిలో రంగు మారే వరకు బాగా వేయించాలి. 

స్టెప్ -4

ఇప్పుడు వీటిని తీసుకుని  చక్కెర పాకంలో వేసి 15 నిముషాల పాటు అలా ఉంచి తినేయండి తియ్యగా టేస్టీగా ఉంటాయి. 

 గులాబ్ జామూన్లు రెడీ