Baldness in Women: మహిళల్లో బట్టతల! అశ్రద్ధ చేస్తే అంతే! చికిత్సా విధానం కోసం వెంటనే క్లిక్ చేయండి..

తొలి దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే దీనిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాని పక్షంలో వెంట్రుకల మధ్య గ్యాప్ బాగా పెరిగి పోయి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చని చెబుతున్నారు.

Baldness in Women: మహిళల్లో బట్టతల! అశ్రద్ధ చేస్తే అంతే! చికిత్సా విధానం కోసం వెంటనే క్లిక్ చేయండి..
Women Baldness
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2022 | 4:26 PM

పురుషుల్లో బట్టతల సర్వసాధారణం.. కానీ మహిళల్లో కూడా ఇటీవల కాలంలో బట్టతల బాధితులు పెరుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 45 మిలియన్ల మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. తొలి దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే దీనిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాని పక్షంలో వెంట్రుకల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చని చెబుతున్నారు.

లక్షణాలు ఇవి..

మహిళల్లో బట్టతల (ఫీమైల్ ప్యాటరన్ హైర్ లాస్) తొలుత జట్టు పల్చనవడంతో ప్రారంభమవుతుంది.. బాగా హెయిర్ లాస్ అవుతుంది. అంత మాత్రమే కాక దురద పెట్టే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన చోట ఎక్కువ రాపిడికి గురై పుండు పడే ప్రమాదం కూడా ఉంటుంది.

ప్రధాన కారణాలు..

మహిళల్లో బట్టతలకు ప్రత్యేకంగా ఈ కారణాలంటూ ఏమి ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరిలో ఒక్క రకంగా .. కారణాలు కూడా మారుతుంటాయని వివరిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మహిళల్లో బట్టతల వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

– జన్యు పరమైన కారణాలు – వయసు పెరగడం – శరీరంలో హార్మోన్ల సమతుల్యత వచ్చినప్పుడు – పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కావడం, రుతుక్రమం తప్పడం – పాలిసిస్టిక్ అనే అండాశయ సంబంధిత వ్యాధి సోకినప్పుడు

చికిత్సా విధానాలు..

సాధారణంగా జట్టు రాలడానికి గుర్తించిన కారణాలను బట్టి మందులు ఇస్తారు. వాటిల్లో మినాక్సిడిల్, ఫినాస్టరాయిడ్ ముఖ్యమైనవి. దీనిని వెంటుక్రల కుదుళ్ల వద్ద వైద్యులు సూచించిన విధంగా పూయాలి. ఒకవేళ హార్మోన్ల అసమతుల్యత ఉంటే నోటి ద్వారా వేసుకునే కొన్ని రకాల యాంటీ ఆండ్రోజెన్ వంటి మందులు వైద్యుల సూచన మేరకు వినియోగించాలి.

క్యూ ఆర్ 678తో అద్భుతాలు..

హెయిర్ లాస్ నివారణకు ఇటీవల అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్స ఇది. దీని ద్వారా వెంట్రుకలు ఊడిపోవడాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఈ క్యూ ఆర్ 678 చికిత్సలో ఎటువంటి నొప్పి ఉండదు. త్వరితగతిన ఫలితాలు వస్తాయి. ఎఫ్డీఏ అనుమతి పొంది, యూనైటెడ్ నేషన్స్ అలాగే ఇండియాలో పేటెంట్ హక్కులు సంపాదించిన ఈ చికిత్సా విధానం ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

లేజర్ థెరపీ..

హెయిర్ లాస్ కు లేజర్ చికిత్సకు ఎఫ్డీఏ అనుమతి ఉంది. ఈ లైట్ థెరపీ వల్ల ఫోలికల్స్ ప్రేరేపించబడతాయి. ఇదికొంత వరకూ మాత్రమే ఫలితాలను ఇస్తుంది.

ప్లేట్ లెట్ ప్లాస్మా థెరపీ..

ఈ చికిత్సా విధానంలో రోగి నుంచి మంచి ప్లాస్మాను తీసుకుని కుదుళ్లలో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఆరు నెలలకు ఓ సారి చేస్తూ ఉంటే తల వెంట్రుకలు ఒత్తుగా ఎదుగుతాయి.

ఆరోగ్యకరమైన జీవన విధానం ఉండాలి..

మీ జీవన విధానంలో కొన్ని లోపాల కారణంగా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. మంచి ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. వారానికి కనీసం ఐదు సార్లు శరీరక వ్యాయామం చేస్తూ ఉంటే తల వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

వీటితో పాటు మహిళల్లో బట్టతల.. తొలగించడానికి కొన్ని సర్జికల్ చికిత్సా విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మందులతో ఎటువంటి ప్రయోజనం లేని సందర్భంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి వాటిని ట్రై చేయొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..