Health Secrets: ప్రతి రోజూ వర్క్ అవుట్ చేస్తే వందేళ్లు బతుకుతారా?.. సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఇది చూడండి..
ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా ప్రతి రోజూ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. అతనికి అరవై ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1983 నుంచి ప్రతి రోజూ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఆహార నియమాలను పాటించడంతో పాటు వర్క్ అవుట్స్ వల్ల ఆరోగ్యంగా ఉన్నానని అంటున్నాడు. మరి ఆ వ్యక్తి చెప్పే హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా..
వృద్ధాప్యం….ఈ పేరు వింటేనే మనలో చాలా మంది ఆ వయస్సులో ఇంకెమీ చేయలేం అనుకుంటారు. ఒకవేళ చేయాలనుకున్నా శక్తి సరిపోదు..మన తాతయ్య, అమ్మమ్మ వయస్సు ఉన్న వాళ్లు ఎలా ప్రశాంత జీవిస్తున్నారో? మనం కూడా అలానే జీవించాలనుకుంటాం.. కానీ ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా ప్రతి రోజూ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. అతనికి అరవై ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1983 నుంచి ప్రతి రోజూ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఆహార నియమాలను పాటించడంతో పాటు వర్క్ అవుట్స్ వల్ల ఆరోగ్యంగా ఉన్నానని అంటున్నాడు. మరి ఆ వ్యక్తి చెప్పే హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా..
పెన్సిల్వేనియాలోని హనోవర్ పట్టణానికి చెందిన లెస్ సనివో వయస్సు ఇప్పడు వందేళ్ల పైగానే ఉంటుంది. ఇతను 1983 నుంచి స్థానికంగా ఉండే వైఎంసీఏ జిమ్ లో డైలీ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. దీని వల్లే తాను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నానని అంటున్నాడు. తన ఆరోగ్యానికి వర్క్ అవుట్ ఒక్కటే ప్రధాన కారణం కాదని ఆరోగ్య నియమాలు కఠినంగా పాటించడం కూడా ఓ కారణమేనని చెబుతున్నాడు. తాను కచ్చితంగా వారానికి ఐదు రోజులు జిమ్ కు వెళ్తానని, ఉదయం 7:30 నుంచి 10:30 పాటు వర్క్ అవుట్స్ చేస్తానని చెబుతున్నాడు. అలాగే నిర్ధిష్ట ఆహార నియమాలను పాటిస్తానని పేర్కొంటున్నాడు. చిన్నపాటి రుగ్మతలకు మందులు వాడనని చెబుతున్నాడు. అయితే కూరగాయలు, చేపల వంటి ఆహారాన్ని ఇష్టంగా తింటానని స్పష్టం చేస్తున్నాడు.
అయితే తనకి ఇంకా వందేళ్లు వచ్చిన్నట్టు అనిపించడం లేదని అంటుంటాడు. చాలా మంది తన వయస్సులో ఉన్న ఇంకా తామేమి చేయలేమని బాధపడుతుంటారని, కనీసం మన ఆరోగ్యం కాపాడుకోడానికైనా ప్రయత్నించాలని సూచిస్తున్నాడు. ఈ వయస్సులో చాలా మంది మందులపైనే బతుకుతారని, తాను అలా చేయనని కేవలం బీపీకు మాత్రమే మందులు వాడతానని చెబుతున్నాడు.
లెస్ సనివో హెల్త్ సీక్రెట్స్ ఇవే..
లెస్ సనివో జిమ్ లో వర్క్ అవుట్స్ సెట్ చేసుకోడానికి ఓ డైరీ సెట్ చేసుకున్నాడు. సోమ, బుధ, శుక్రవారాల్లో అతను జిమ్ బరువు ఎత్తుతాడు. 15 కేజీల వెయిట్ మెషీన్ ద్వారా రోజు 45 రిప్స్ చేస్తాడు. మంగళ, గురు వారాల్లో మాత్రం కార్డియోకు సంబంధించి వ్యాయామం చేస్తాడు. తాను జిమ్ చేయడం వల్ల రోజు ఓ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని చెప్పాడు. జిమ్ చేయడం వల్ల తాను ప్రతిరోజూ మోటివేట్ అవుతున్నాని చెబుతున్నారు.
కేవలం శారీరక వ్యాయామాలే కాకుండా ఆహారంలో కూడా తాను చాలా కచ్చితంగా ఉంటానని చెబుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తిననని, అయితే సీ ఫుడ్స్ మాత్రం ఇష్టంగా తింటానని చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం కూడా ఆరోగ్య రహస్యమని చెబుతున్నాడు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి