Potato for Diabetics: బంగాళదుంప తినడం వల్ల షుగర్ పెరుగుతుందా? ఇలా తింటే సేఫ్ అంటున్న వైద్యులు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka

Updated on: Dec 15, 2022 | 4:44 PM

చాలా కాలం నుంచి బంగాళదుంప తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే వాదన ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు అధిక కార్బోహైడ్రేట్లను నియంత్రించడానికి బంగాళదుంపను బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఇతర కూరగాయలతో వండుకుని తింటే మంచిదని అంటున్నారు. ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడడమే కాక రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది.

Potato for Diabetics: బంగాళదుంప తినడం వల్ల షుగర్ పెరుగుతుందా?  ఇలా తింటే సేఫ్ అంటున్న వైద్యులు
Potatoes
Follow us

వయస్సుతో సంబంధం లేకుండా అంతా డయాబెటిక్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తారు. చాలా కాలం నుంచి బంగాళదుంప తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే వాదన ఉంది. కొంత మంది వైద్యులు డైరెక్ట్ గానే షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంప తినకూడదని సూచిస్తుంటారు. అయితే ఈ వాదన నిజమా? కాదా? అని తెలుసుకుందాం. దేశంలో ప్రతి ప్రాంతంలో బంగాళదుంప వినియోగం అధికంగా ఉంటుంది. సహజంగానే దుంప అంటే పిండి పదార్థం. దీన్నితినడం అధిక రక్తపోటు, అలాగే అజీర్తి సమస్యలను నుంచి బయటపడవచ్చు. బంగాళదుంప వండటం కూడా సులువు కావడంతో అంతా విరివిగా వాడుతుంటారు. అంతా బాగానే ఉన్నా షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం బంగాళదుంపను ఓ బ్రహ్మ పదార్థంలా చూస్తారని అది తప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

అదే అసలు సమస్య

సాధారణంగా ఓ ఆరోగ్యకరమైన వ్యక్తికి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ప్యాంక్రియాస్ తగిన మొత్తంలో ఇన్సులిన్ విడుదల చేసి అతని శక్తిని తిరిగి పొందడానికి సాయం చేస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం శరీరంలో అన్ని కార్బోహైడ్రేట్లు గ్రహించలేరని అందువల్లే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. బంగాళదుంపలో మీడియం నుంచి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్(GI)  కలిగి ఉంటాయి. కానీ జీఐ మాత్రమే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణం కాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. 

వీటితో వండితే సేఫ్ 

బంగాళదుంప నిరభ్యంతరంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాటిని వేటితో కలిపి వండుతున్నామో? అనేది ముఖ్యమని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు అధిక కార్బోహైడ్రేట్లను నియంత్రించడానికి బంగాళదుంపను బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఇతర కూరగాయలతో వండుకుని తింటే మంచిదని అంటున్నారు. ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడడమే కాక రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. బంగాళదుంపలో విటమిన్లు, మినరల్స్ తో పాటు కొంతమేర పీచు కూడా ఉంటుంది. కాబట్టి మాంసం, చిక్కుళ్లు వంటి ప్రోటీన్లు, కొవ్వు ఉండే పదార్థాలతో వండుకుంటే మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబతున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద బంగాళదుంపను తినడం వల్ల షుగర్ సమస్య పెరగదని, దాన్ని ఎలా తింటున్నామో? అనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాయయం చేయడం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu