Chilli Powder: కారం ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్యానికి అది పెనుభారమే.. తప్పదు భారీ మూల్యం.. !

వంటల్లో కారం తగినంత మోతాదులో తింటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉప్పు, కారం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో తెలుసా..?

Chilli Powder: కారం ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్యానికి అది పెనుభారమే.. తప్పదు భారీ మూల్యం.. !
Red Chilli
Follow us

|

Updated on: Dec 15, 2022 | 6:25 PM

మితిమీరిన అమృతం కూడా విషంగా మారుతుందంటారు..అలాగే ఎక్కువ కారం, మసాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అయితే కొంతమందికి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. ఉప్పు తక్కువగా ఉందని, రేపటి నుంచి ఎక్కువ ఉప్పు వేయాలని కూడా భోజన ప్రియులు సూచనలు ఇస్తుంటారు. కానీ, ఇలాంటి అలవాట్లు శరీరానికి చాలా హాని చేస్తాయని చాలామంది తెలుసుకోరు. ఇంకొందరు బరువు తగ్గేందుకు కూడా కారం పొడి ఎక్కువగా తింటారట.. కానీ, ఎక్కువ కారం తినేవారి ఆరోగ్యానికి హాని ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు. వంటల్లో కారం తగినంత మోతాదులో తింటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉప్పు, కారం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

కడుపులో పుండు, అల్సర్.. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతారు. కారం ఎక్కువగా తింటే అల్సర్ వచ్చే అవకాశం ఉందట. కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయట. కారం ఎక్కువ తింటే ఎసిడిటీ వస్తుంది. బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు వస్తాయట. గొంతు, కడుపులో మంట పుడుతుందట. కారం తింటే గ్యాస్ సమస్య వస్తుందట. కొందరకి కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయట.

డయేరియా: ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా అటాక్‌లు వచ్చే అవకాశం ఉంది. కారంపొడి అధిక వినియోగం కడుపుకు మంచిది కాదు. ఇది పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులు డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎసిడిటీ: ఎర్ర మిరపకాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది. అలాగే కొంతమంది తరచుగా గుండెల్లో మంట అంటుంటారు. మీరు అలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఎర్ర మిరపకాయలు తీసుకోవడం మానేయండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి