Mangaluru: బస్సులో మహిళ బ్యాగ్ పట్టుకున్న పాపానికి.. పాపం బలైపోయాడు.. తుక్కుతుక్కుగా కొట్టేశారు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇసాక్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Mangaluru: బస్సులో మహిళ బ్యాగ్ పట్టుకున్న పాపానికి.. పాపం బలైపోయాడు.. తుక్కుతుక్కుగా కొట్టేశారు
Delhi Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 15, 2022 | 2:53 PM

బస్సులో ప్రయాణిస్తున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే నెపంతో ఓ వ్యక్తిని కొందరు యువకులు చావచితక్కొట్టారు.  ఆ కారణంగా అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరు జిల్లా మూడబిదిరె తాలూకా రాయిలో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిపై బస్‌ కండక్టర్‌, యువకులు దారుణంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడికి గురైన వ్యక్తిని మూలారపట్‌కు చెందిన ఇసాక్ (45)గా గుర్తించారు. వివరాల మేరకు..

తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మూలారపట్‌ బుధవారం ఉదయం బిసి రోడ్డు నుంచి ప్రైవేట్ బస్సులో మూడ్‌బిద్దె వెళ్తున్నాడు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇసాక్ కూర్చున్న సీటు దగ్గర నిలబడిన ఓ మహిళ బ్యాగ్ పట్టుకోమని అడిగింది. అనంతరం మహిళ దిగిన ప్రదేశంలో ఇసాక్ నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. దీని తర్వాత, బస్సు కండక్టర్ ఇస్సాక్ వద్దకు వచ్చి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. అతనిని బస్సు నుండి దించి అతనిపై దాడి చేశాడు. దాడి సమయంలో బస్సు కండక్టర్ తన మొబైల్ ఫోన్‌లో ఇంకొందరికి కాల్ చేశాడు.. కొంతమంది యువకులను సంఘటనా స్థలానికి పిలిపించాడు. అనంతరం ఇసాక్‌ను ఆ యువకుల బృందానికి అప్పగించాడు కండక్టర్‌.

ఇక అంతే, యువకుల బృందం ఇసాక్‌ను రిక్షాలో తీసుకెళ్లి రాయిలోని నిర్జన ప్రాంతంలో చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారని చేసినట్లు సమాచారం. ఇసాక్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇసాక్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి