Uttar Pradesh: తాగుబోతుల పైశాచికం.. మద్యం మత్తులో రెండు కుక్కపిల్లల తోకలు, చెవులు కోసి స్నాక్స్‌గా తినేశారు..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ మద్యం సేవించిన ఉన్నారని, నిందితులు ముఖేష్ వాల్మీకి, అతని స్నేహితుడు కలిసి మద్యం సేవించారు. కానీ, తినడానికి స్నాక్స్ లేకపోవడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫరీద్‌పూర్‌లో ఓ పైశాచిక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు తాగుబోతులు నోరులేని కుక్కపిల్లలపై పైశాచికం ప్రదర్శించారు. కుక్కపిల్లల చెవులు, తోకలను కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికుల సంస్థ సీరియస్ అయ్యింది. స్థానిక ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ మద్యం సేవించిన ఉన్నారని, నిందితులు ముఖేష్ వాల్మీకి, అతని స్నేహితుడు కలిసి మద్యం సేవించారు. కానీ, తినడానికి ‘చాట్’ లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డారు. అలా ఇద్దరు తాగుబోతులు వీధిలో రెండు కుక్కలను పట్టుకుని వాటిలో ఒకదాని చెవులు, మరొకదాని తోక కోసేశారు! తర్వాత తెగిన తోకను, ఒక జత చెవులను మద్యంతో ‘స్నాక్స్’గా తిన్నారని తెలిసింది. పైగా ఆ రెండు కుక్కపిల్లలకు కూడా మద్యం తాగించారని చెప్పారు.
ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న నీరజ్ పాఠక్ అనే జంతు ప్రేమికుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. నీరజ్ ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అనే సంస్థతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, ముఖేష్, అతని స్నేహితుడిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మరోవైపు, గాయపడిన రెండు కుక్కపిల్లలను నీరజ్ తన స్వంత చొరవతో రక్షించాడు. రెండు కుక్కలనుచికిత్స నిమిత్తం జంతు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెండు కుక్క పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. జంతువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన సెక్షన్ కింద ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.
రెండు చిన్న జంతువుల పట్ల ఇలాంటి క్రూరత్వం తమను కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని పోలీసు అధికారి దయాశంకర్ మీడియాకు తెలిపారు. నిందితులు దోషులుగా తేలితే కఠినంగా శిక్షించేలా పోలీసులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటారని ఇన్‌స్పెక్టర్ దయాశంకర్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి