AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : టమోటా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం మీ సొంతం..! ఎలా వాడాలో తెలుసుకోండి..

మెరిసే చర్మాన్ని పొందడమే కాకుండా, చర్మంలోని అదనపు నూనెను తొలగించడానికి, చర్మాన్ని బాగా శుభ్రపరచడానికి, మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి టమోటాలు ఒక గొప్ప పరిష్కారం.

Beauty Tips : టమోటా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం మీ సొంతం..! ఎలా వాడాలో తెలుసుకోండి..
Tomato Face Packs
Jyothi Gadda
|

Updated on: Dec 14, 2022 | 6:50 PM

Share

విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ K1 వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన టమోటాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తాయి. టొమాటో చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మురికిని తొలగిస్తుంది. టొమాటో ఫేస్ ప్యాక్  చర్మాన్ని తాజాగా, పునరుజ్జీవింపజేస్తుంది. ఇవి టాన్‌ను తొలగిస్తాయి. సన్‌బర్న్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడమే కాకుండా, చర్మంలోని అదనపు నూనెను తొలగించడానికి, చర్మాన్ని బాగా శుభ్రపరచడానికి, మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి టమోటాలు ఒక గొప్ప పరిష్కారం. ముఖ సౌందర్యం కోసం టమోటాలు ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం…

చర్మం జిడ్డు తగ్గాలంటే టొమాటోను కోసి రసాన్ని తీసి చర్మానికి పట్టించి ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయండి. మీ చర్మం మెరిసిపోతుంది.

టొమాటో గుజ్జును తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, ఒక టీస్పూన్ పుదీనా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ సన్ టాన్ తొలగించి, టోన్డ్, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి పెరుగు, నిమ్మరసం, టమోటాల మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ప్యాక్ తయారు చేయాలి. తర్వాత దానిని మీ ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.

టమాటాని గుజ్జు, కొంచెం ఓట్స్, ఒక స్పూన్ పెరుగు కలిపి, ముఖానికి మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే నల్లని చర్మం తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను, మృదువుగా మారుతుంది. టమాటా రసంలో, నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మీ ముఖం నిగనిగలాడుతుంది.

శనగపిండిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ప్రభావం కనిపిస్తుంది. టమాటాల గుజ్జుని పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు