Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యయ్యో.. ముందే చూసుకోవాలి కదా.. దొంగతనం చేయాలనుకొని అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో చూస్తే నవ్వాగదు..

ఇంతలోనే షాప్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ చూసేందుకు వచ్చినట్లు నటిస్తాడు. తల, ముఖం కనిపించకుండా అతడు మాస్క్‌ ధరించి ఉన్నాడు.

Viral Video: అయ్యయ్యో.. ముందే చూసుకోవాలి కదా..  దొంగతనం చేయాలనుకొని అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో చూస్తే నవ్వాగదు..
Thief Trying To Run
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 6:38 PM

సోషల్ మీడియా ద్వారా మనం ప్రతిరోజూ అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో చాలా వరకు ఫేక్ వీడియోలుగా అనిపిస్తుంటాయి. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన కంటెంట్ తో పలు వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ వాస్తవ సంఘటనలకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట ఎవరూ అడ్డుకోలేనంతగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వైరల్‌ వీడియోలు ఫన్నీ సంఘటనల నుండి విషాదకరమైన ప్రమాదాల వరకు ఈ వీడియోలు వైరల్ అవుతాయి. తాజాగా అలాంటిదే ఇక్కడ ఒక దొంగకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. వీడియోలో, ఒక దొంగ పట్టపగలు మొబైల్ షాప్ నుండి ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఘటన యూకేలోని డ్యూస్‌బరీలో చోటుచేసుకుంది.

దుకాణంలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారు దుకాణదారులు, లేదా కార్మికులు కావచ్చు. ఇంతలోనే షాప్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ చూసేందుకు వచ్చినట్లు నటిస్తాడు. తల, ముఖం కనిపించకుండా అతడు మాస్క్‌ ధరించి ఉన్నాడు. దాంతో అతని ముఖం సీసీటీవీ ఫుటేజీలో కనిపించడం లేదు. అయితే ఫోన్‌తో ఊడాయించేందుకు ప్రయత్నించిన దొంగ ప్లాన్‌ బెడిసికొట్టింది.

ఇవి కూడా చదవండి

దుకాణదారుడి దృష్టిని తప్పించి అతివేగంతో ఖరీదైన ఫోన్‌తో పారిపోవాలనేది దొంగ పథకం. కానీ దుకాణదారుడు అప్పటికే రిమోట్‌ని ఉపయోగించి డోర్ లాక్ చేసేశాడు. దీంతో ఆ దొంగ ఆటకట్టించినట్టైంది. వేరే మార్గం లేకపోవటంతో తనను తాను తిట్టుకుంటూ,ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాడు. తనను వెళ్లనివ్వమంటూ వేడుకున్నాడు. వారం రోజుల క్రితం జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియో వైరల్ కావడంతో, షాప్ యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పగటిపూట దొంగల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతో డోర్ లాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేశానని, ఇప్పుడు అది ఉపయోగపడిందని చెప్పాడు. మాస్క్‌లు, బురఖాలు ధరించి వచ్చే వారిపై విక్రయదారులు ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు. అయితే ఈ విషయాలేవీ దొంగ గమనించలేదనే అనుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, ఫన్నీ వీడియోను వేలాది మంది వీక్షించారు. చాలా మంది షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి