Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: 82ఏళ్లుగా ఆ ఇంట్లో తిష్టవేసిన నల్లటి నీడ..! తరిమికొట్టేందుకు కోటి రూపాయల ఖర్చు..

ఆ నల్లటి నీడ వల్లే మీరంతా బాధలు పడుతున్నారు, భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయి. దాన్ని తరిమికొట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చుపెటాల్సి ఉంటుందని చెప్పారు.

Black Magic: 82ఏళ్లుగా ఆ ఇంట్లో తిష్టవేసిన నల్లటి నీడ..! తరిమికొట్టేందుకు కోటి రూపాయల ఖర్చు..
Black Magic
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 3:54 PM

నమ్మేవారుండాలే గానీ, మోసం చేసే వారికి అడ్డూ అదుపులేదు. మీ ఇంట్లో బంగారం నిధి ఉందని, మీ పెరట్లో లంకెబిందేలు బయటపడతాయని అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తుంటారు కొందరు దొంగ బాబాలు. మరికొందరు క్షుద్రపూజలు, చేతబడులు,దెయ్యం పట్టిందని భయపెట్టి నమ్మినవారిని నిలువుదోపిడీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో గుర్తుతెలియని నీడ ఒకటి ఉందని, అది ఆ ఇంటిల్లిపాదిని వెంటాడుతుందని భయపెట్టి ఏకంగా 35లక్షల రూపాయలు దండుకున్నారు దుండగులు. బంగారం, వెండి ఇతరాత్ర విలువైన వస్తువులు కూడా మడతపెట్టుకుని ఊడాయించారు. తీరా నిండామునిగాక తెరుకున్న బాధితులు చేసేది లేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

గుజరాత్‌లోని బనస్కాంత ధనేరాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ధనేరా తహసీల్‌లోని గెలా గ్రామంలో జరిగింది ఘటన. ఐదుగురు తాంత్రికులు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. నిజానికి ఆ కుటుంబం చాలా కాలంగా ఏదో ఆందోళనలో ఉందని వారు తెలివిగా పసిగట్టారు. అమాయకుల్లోని భయాన్ని ఆసరాగా చేసుకున్న ఐదుగురు దొంగమాంత్రీకులు ఆ ఇంట్లో నల్లని నీడ ఉందని భయపెట్టారు. అది వారిని వెంటాడుతుందని హడలెత్తించారు. గత 82 ఏళ్లుగా తమ ఇంట్లో నల్లటి నీడ దాగి ఉందని చెప్పారు. దాన్ని తరిమికొట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికారు. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చుపెటాల్సి ఉంటుందని చెప్పారు. ఆ నల్లటి నీడ వల్ల మీరంతా బాధలు పడుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని భయపెట్టారు. దాంతో ఆ కుటుంబం దాని పరిష్కారం కోసం వారిని కోరింది.

తాంత్రికులు వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి మొదటి నవరాత్రులలో కొన్ని తాంత్రిక ఆచారాలను నిర్వహించారు. దీనికి బదులు కుటుంబం నుంచి 20 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల మరో పద్ధతి చేసి 15 లక్షలు కాజేశారు. అంతే కాదు రూ.1.7 లక్షల విలువైన వెండిని కూడా తీసుకున్నారు. కానీ, ఆ కుటుంబం దుఃఖం, కష్టాలు తీరకపోవడంతో, వారు తాత్రికులను అనుమానించారు. తాము మోసపోయామని గ్రహించారు. బాధిత కుటుంబీకులు వెంటనే ఐదుగురు తాంత్రికులపై ధనేరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తాంత్రిక పద్దతి చేస్తున్న వీడియోను కూడా పోలీసులకు అందజేశారు. ఈ 38 సెకన్ల వీడియోలో తాంత్రికుడు భూతవైద్యం చేస్తూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నిందితులుగా ఉన్న ఐదుగురు తాంత్రికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి