Vastu Tips : రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..!

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Dec 13, 2022 | 8:24 PM

ఈ వాస్తు చిట్కాలు ఇంట్లో శ్రేయస్సు, సంపదనను సృష్టిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇలాంటి కొన్ని చిట్కాలను ప్రయత్నించండి. దీంతో ఇంట్లో వాస్తు దోషం ఉన్నా సరిదిద్దుకునే అవకాశం ఉందంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips : రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..!
Vastu Tips

సంతోషకరమైన జీవితం కోసం వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కారాలు సూచించబడ్డాయి. వాటిని అనుసరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ చిట్కాలు పాటించకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తోందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ వాస్తు చిట్కాలు ఇంట్లో శ్రేయస్సు, సంపదనను సృష్టిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇలాంటి కొన్ని చిట్కాలను ప్రయత్నించండి. దీంతో ఇంట్లో వాస్తు దోషం ఉన్నా సరిదిద్దుకునే అవకాశం ఉందంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

వంటగది.. రాత్రి పడుకునే ముందు బకెట్‌లో నీళ్లు నింపి వంటగదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తీరిపోవడంతో పాటు డబ్బు సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.

బకెట్.. వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. ఎప్పుడూ ఒక బకెట్ నిండా నీళ్ళు పెట్టుకోండి. దీంతో సంతోషించిన లక్ష్మీదేవి తన ఆశీస్సులు అందజేస్తుంది. ఈ సందర్భంలో, రాత్రి పడుకునే ముందు, బాత్రూంలో ఒక బకెట్ నిండా నీరు ఉంచండి.

ఇవి కూడా చదవండి

దీపం.. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. దీనితో పాటు మెయిన్ డోర్ లైట్ కూడా వెలిగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట ఇంట్లో వెలుతురు ఉన్నప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.

Note: (రాశిఫలాలు, వాస్తు చిట్కాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu