Horoscope 2023: మకర రాశి వారికి 2023 సంవత్సరం ఎలా ఉంటుంది, ఉద్యోగం, వృత్తి ,విద్యా పరిస్థితులను తెలుసుకోండి

2023లో శని రాశి తన రాశిని మార్చుకోవడం వలన ఈ రాశివారికి ఏలిన నాటి శని చివరి దశ ప్రారంభమవుతుంది. దీంతో కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సంబంధించిన పనుల్లో మెల్లమెల్లగా పురోగతి మొదలవుతుంది.

Horoscope 2023:  మకర రాశి వారికి 2023 సంవత్సరం ఎలా ఉంటుంది, ఉద్యోగం, వృత్తి ,విద్యా పరిస్థితులను తెలుసుకోండి
Capricorn
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2022 | 2:39 PM

శనీశ్వరుడు మకరరాశికి అధినేత. 2023 సంవత్సరంలో మకరరాశిని విడిచిపెట్టి శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. జనవరి 17న శనిగ్రహం మకర రాశిలోని రెండో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 2023లో శని రాశి తన రాశిని మార్చుకోవడం వలన ఈ రాశివారికి ఏలిన నాటి శని చివరి దశ ప్రారంభమవుతుంది. దీంతో కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సంబంధించిన పనుల్లో మెల్లమెల్లగా పురోగతి మొదలవుతుంది. ఇప్పుడు అపజయాలకు బదులు విజయాలు పొందడం ప్రారంభిస్తారు.

ధనలాభం, మానసిక ప్రశాంతత క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా బృహస్పతి తన రాశిని మార్చుకుంటాడు. దేవగురువు బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశి నాల్గవ ఇంట్లో ఉండనున్నాడు. నాల్గవ ఇల్లు ఆస్తికి చిహ్నం. ఏప్రిల్ మాసం వచ్చే సరికి గురుడు మీనరాశి నుండి మేషరాశికి వెళతాడు.. అక్కడ గురు, రాహువుల కలయిక వల్ల గురు చండాల దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో.. ఈ రాశివారు కొన్ని మానసిక సమస్యలను, బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది. అక్టోబర్ 30 న, మేషరాశిని విడిచిపెట్టిన తర్వాత, రాహువు మీన రాశిలోకి వెళ్లి ఈ రాశివారు శౌర్యాన్ని ప్రభావితం చేస్తాడు.

మకర రాశిఫలం 2023లో కెరీర్ కెరీర్ పరంగా.. మకర రాశి వారికి 2023 సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ  రాశిలో శని అర్ధరాశి చివరి దశ ప్రారంభమవుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం..  ఏలిన నాటి శని ఏ రాశిలోనైనా చివరి దశలో ఉన్నప్పుడు, అప్పుడు శుభ ఫలితాలు పొందడం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. పెట్టుబడి పెట్టిన డబ్బులో మంచి పెరుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మకర రాశిఫలం 2023లో ఆర్థిక స్థితి మకర రాశి వారికి శని 2023 సంవత్సరంలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కోణంలో ఈ రాశివారు ఆర్థిక పరిస్థితి ఏడాది పొడవునా చక్కగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మకర రాశివారు ఒకేసారి అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త సంవత్సరం..  భూమి-ఆస్తి , ఇంటి కొనుగోలు , విక్రయాల నుండి ప్రయోజనాలను పొందుతారు. 2023 సంవత్సరంలో, ఈ రాశివారు  భూమి ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యం ఉన్నవారు కొత్త సంవత్సరాంతంలో కొంత నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది.

మకర రాశిఫలం 2023లో కుటుంబ జీవితం 2023 సంవత్సరం ప్రారంభంలో, మకర రాశి వారు కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. 2023లో మానసిక సమస్యల వల్ల ఈ రాశి వ్యక్తుల తల్లికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే, ఏప్రిల్ నెలలో మేషరాశిలో బృహస్పతి సంచారం నుండి కొంత ఉపశమనం పొందే సూచనలు ఉన్నాయి. పాత కుటుంబ వివాదాలు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. సంవత్సరాంతంలో మతపరమైన కార్యక్రమం నిర్వహించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ సయోధ్య కలుగుతుంది.

మకర రాశిఫలం 2023లో ఆరోగ్యం ఈ రాశివ్యక్తులపై ఏలిన నటి శని ప్రభావం చివరి దశలో ఉండడం వలన వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మానసిక సమస్యల నుండి బయటపడతారు. యోగా, వ్యాయామం పట్ల ఇష్టం పెరుగుతుంది. సంవత్సరం మధ్యలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి..  లేకుంటే ప్రమాదం జరగవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందే సంవత్సరం అవుతుంది. సంవత్సరాంతంలో కొన్ని కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం ఆహారం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.

మకర రాశి ఫలం 2023లో పరీక్ష-పోటీ విద్య, పోటీ పరీక్షలలో నిమగ్నమైన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మంచి విజయాన్ని పొందుతారు. మకరరాశిలో శని తృతీయ రాశిలో ఉండటం వల్ల విద్యార్థులు పరీక్షలో మంచి విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)