World Bhavishyavani 2023: కొత్త సంవత్సరంలో తన రాశి స్థానాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు.. 2023లో బీభత్సం తప్పదా..?
శని 2022 ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రవేశించి.. ఆపై 12 జూలై 2022న మకరరాశిలో తిరోగమనం మొదలు పెట్టింది.. అప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై ఏడాది పూర్తి చేసుకోనుంది.
కొత్త సంవత్సరం 2023లో అడుగు పెట్టడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2022 సంవత్సరం చరిత్ర పుటల్లో నిలిచి పోవడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ 2023 కోసం ఎదురుచూస్తున్నారు.. రానున్న ఏడాది ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల నుండి ఉపశమనం లభిస్తుందా లేదా ప్రపంచం కొత్త రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం జ్యోతిష్యంలో ఉంది. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం.. ప్రపంచంలో భారీ మార్పు వచ్చినప్పుడల్లా లేదా కొత్త సంక్షోభం ఏర్పడినప్పుడు శని, కుజుడు , రాహు-కేతువు వంటి గ్రహాల ప్రభావం అటువంటి మార్పులలో ఖచ్చితంగా ఈ గ్రహాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయని విశ్వాసం.
30 సంవత్సరాల తర్వాత 2020 జనవరి 24న శని గ్రహం తన సొంత రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రపంచంలో అంటువ్యాధులు, యుద్ధాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇంకా ఈ వైపరీత్యాలతో ప్రపంచం పోరాడుతూనే ఉంది. 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు లక్షల మంది వివిధ కారణాలతో మరణించారు.
ప్రపంచంలోని వినాశనానికి శని ప్రభావమేనా.. 2020 సంవత్సరం నుండి ప్రపంచంలో వినాశనం ప్రారంభమైంది.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. జనవరి 24, 2022 న.. శని తన సొంత రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు.. మొత్తం ప్రపంచంలో ఆర్థిక తిరుగుబాటు, శక్తి మార్పు, అంటువ్యాధి, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ కాలం ప్రారంభమైంది. 2020లో కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను తీసింది. అప్పటి నుంచి ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. శని మకరరాశిలో తిరోగమనం చెంది.. 2022 ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు.., రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం వలన ప్రపంచం రెండు భాగాలుగా విభజించబడింది.
జూన్ 05, 2022 న శని తిరోగమనం ప్రారంభించి.. జూలై 12, 2022 న కుంభం నుండి తన ప్రయాణాన్ని నిలిపివేశాడు. మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచంలో చాలా మార్పులు కనిపించాయి. ఇందులో రాజకీయ పరిణామాలు, అధికార మార్పిడి, ప్రకృతి వైపరీత్యాలు మొదలయ్యాయి. అక్టోబరు 23, 2022న, శని తిరోగమనంలో కొంతకాలం ప్రపంచంలో శాంతి నెలకొంది. కానీ ఈ సమయంలో ప్రపంచం ఇతర సమస్యలతో ఇబ్బంది పడింది. ఇందులో ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం వంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కోవడం ప్రారంభించింది. ఆ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
2023లో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు 2020వ సంవత్సరంలో శనిగ్రహం రాశి మార్పు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఇప్పుడు మరోసారి జనవరి 17, 2023న శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ప్రపంచంలో అనేక మార్పులు ఏర్పడనున్న సంకేతాలు కనిపిస్తున్నాయని జ్యోతిస్క్యులు చెబుతున్నారు. ఈ మార్పు యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యం రూపంలో ప్రపంచం ముందుకు రావచ్చు. ఈ సమయంలో.. కొన్ని భారీ ఖగోళ విధ్వసం ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది.
2023లో శని బీభత్సం సృష్టిస్తుందా? 2023వ సంవత్సరంలో శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తే మహా వినాశనానికి అవకాశం ఉంటుందని పలువురు జ్యోతిష్యులు, జ్యోతిష్యులు విశ్వసిస్తున్నారు. శని 2022 ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రవేశించి.. ఆపై 12 జూలై 2022న మకరరాశిలో తిరోగమనం మొదలు పెట్టింది.. అప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై ఏడాది పూర్తి చేసుకోనుంది. అటువంటి పరిస్థితిలో.. శని మళ్లీ జనవరి 17, 2023 న కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.. ఇది మార్చి 29, 2025 వరకు ఈ రాశిలో ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెను విధ్వంసం సృష్టించనున్నదని జ్యోతిషశాస్త్ర గణనల అంచనా.. మార్చి 29, 2025 నుండి ఫిబ్రవరి 23, 2028 వరకు.. శని మీనరాశిలో మెల్లగా సంచరించనుంది. దీంతో ప్రపంచంలో చాలా కల్లోలం ఏర్పడనుందని హెచ్చరిస్తున్నారు. శని 23 ఫిబ్రవరి 2028 నుండి 17 ఏప్రిల్ 2030 వరకు మేషరాశిలో ఉంటాడు. 2020 నుంచి 2030 వరకు శని పీడ ఉంటుందని పేర్కొన్నారు. 2030 తర్వాత శని ప్రశాంతంగా ఉండనున్నాడు.. అప్పుడు ప్రపంచం కొత్త శకంలోకి ప్రవేశించనున్నది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)