AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. త్వరలో వీటి ధరలు ఒకేసారి పెరిగే ఛాన్స్.. నేరుగా యుద్ద ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం భారత్‌పై పరోక్షంగా పడుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీని ప్రభావంతో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంత సామాన్యులపై భారం పడనుంది. సామాన్యులకు ఖర్చులు పెరగనున్నాయి.

Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. త్వరలో వీటి ధరలు ఒకేసారి పెరిగే ఛాన్స్.. నేరుగా యుద్ద ప్రభావం
Iran War
Venkatrao Lella
|

Updated on: Mar 04, 2026 | 10:36 AM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. పశ్చిమాసియా దేశాలపై యుద్దం తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే సరుకు రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఇక ఇండియాపై కూడా యుద్దం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి అనేక వస్తువులను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఉద్రిక్త పరిస్ధితుల వల్ల అక్కడి నుంచి భారత్‌కు వచ్చే సరుకు రవాణాలో జాప్యం జరిగే అవకాశముంది. దీని వల్ల దేశంలో పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సామాన్యులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే పప్పు ధాన్యాల నుంచి డ్రైప్రూట్స్ వరకు అనేక పదార్థాల ధరలు పెరగనున్నాయి.

పప్పు దినుసుల ధరలు పెరిగే ఛాన్స్

భారతదేశం మయన్మార్, కెనడా, ఆఫ్రికా వంటి దేశాల నుంచి పప్పు ధాన్యాలను భారీగా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరుకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. దీని వల్ల నౌకల ద్వారా జరిగే సరుకు రవాణాకు ఆటకం కలగనుంది. యుద్దం మరికొద్ది రోజుల పాటు కొనసాగితే రవాణా స్తంభించిపోతుంది. దీని వల్ల కంది పప్పు, పెసరపప్పు వంటి ధాన్యాల ధరలు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. పప్పు ధానాలను పెంచక తప్పతని అంటున్నారు. ఉద్రిక్తతల వల్ల రవాణా, బీమా ఖర్చులు పెరగనున్నాయి. దీంతో రిటైల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడనుంది. ప్రతీ ఇంట్లో తరచూ పప్పు దినుసులు వాడతారు. ఇవి పెరిగితే సామాన్యులకు పిడుగులాంటి వార్త అని చెప్పవచ్చు.

డ్రైఫ్రూట్స్  ధరలు పెరుగుతాయా..?

ఇక డ్రైఫ్యూట్స్ ధరలు కూడా ప్రియం కానున్నాయి. పిస్తా, ఎండుద్రాక్ష, బాదం, ఆప్రికాట్, కుంకుమ పువ్వు వంటి వాటిని ఇరాన్, ఆఫ్గానిస్తాన్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్‌లో యుద్దం వల్ల సరుకు రవాణా నిలిచిపోయే ప్రయాదముంది. దీంతో యుద్దం మరికొన్ని రోజులు కొనసాగితే డ్రైఫ్రూట్స్ ధరలన్నీ పెరగనున్నాయి. ప్రస్తుతం ఇరానీ పిస్తా కిలో రూ .840గా ఉండగా.. రూ.1,300కి పెరిగాయి. ఇక మమ్రా బాదం కిలో రూ.1800గా ఉండగా.. ఇప్పటికే రూ.2,800కి పెరిగింది. ఇక ఆప్రికాట్ ధర రూ.750గా ఉండగా.. ఇప్పుడు రూ.1,400కి చేరుకోనుంది. అటు వంటనూనె, బిస్కెట్లు, సబ్బులు, పేస్టులు, డిటర్జెంట్లు వంటి ధరలు కూడా పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అటు ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందనే వార్తలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి.

Follow Us
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర