AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు పరుగులు.. టైమింగ్స్ ఇవే..

రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెలలో ఈ స్పెషల్ ట్రైన్లు సర్వీసులు అందించనున్నాయి. వీటి వివరాలను ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ల షెడ్యూల్, ఇతర వివరాలు..

Venkatrao Lella
|

Updated on: Jul 29, 2026 | 5:47 PM

Share
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్, విజయవాడ మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ఈ ట్రైన్లు నడవనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఈ ట్రైన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.

1 / 5
రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాన్పూర్ సెంట్రల్-మధురై(01925) స్పెషల్ ట్రైన్ ఆగస్ట్ 5 నుంచి 26వ తేదీ వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ప్రతీ బుధవారం ఉదయం 08.10 గంటలకు కాన్పూర్ సెంట్రల్‌లో బయల్దేరి శుక్రవారం 07.15 గంటలకు మధురై చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో తెలిపింది.

2 / 5
ఇక మధురై-కాన్పూర్ సెంట్రల్ ప్రత్యేక రైలు(01926) ఆగస్ట్ 8 నుంచి 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శనివారం 2.30 గంటలకు బయల్దేరి సోమవారం 04.30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. ఈ మేరకు ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందనే వివరాలను కూడా వెల్లడించింది.

3 / 5
ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈరైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

4 / 5
ఇక కాచిగూడ-తిరుచానూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ-తిరుచానూర్(07787) స్పెషల్ రైలు వచ్చే నెల 13వ తేదీ అందుబాటులో ఉంటుంది. ఇక తిరుచానూర్-కాచిగూడ(07788) స్పెషల్ రైలు వచ్చే నెల 14న సర్వీసులు అందించనుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి

5 / 5
Follow Us