AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!

రిటైల్ రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీమార్ట్ ఇప్పుడు ఫార్మసీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ముంబైలో పైలట్ ప్రాజెక్ట్‌గా మెడికల్ కౌంటర్లు ప్రారంభించి, మందులపై ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నిర్ణయం వినియోగదారులకు లాభదాయకంగా మారనుండగా, సంప్రదాయ మెడికల్ షాపులకు గట్టి పోటీగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
Dmart Pharmacy
Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2026 | 5:51 PM

Share

మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు ఒక చోట దొరికే మార్ట్‌లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది.. ముఖ్యంగా కిరాణా, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ అలాగే దుస్తులు ఎలక్ట్రిక్ పరికరాలు.. ఇలా అన్ని కూడా ఒకే చోట దొరికే మార్ట్‌లకు వినియోదారులు ఎక్కువగా వెళ్తుంటారు.. ఎందుకంటే.. అన్ని దొరుకుతాయి కాబట్టి.. అలాంటి వాటిల్లో DMart ఒకటి.. బయటి మార్కెట్‌తో పోలిస్తే సూపర్‌మార్కెట్ డీమార్ట్ లో అన్ని రకాల వస్తువులు.. సుమారు 5 శాతం నుంచి 20 శాతం తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారు ఎక్కువగా ఇలాంటి సూపర్ మార్కెట్‌లకు వెళ్తుంటారు. అయితే.. తాజాగా.. ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్ డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌ మార్కెట్స్ రిటైల్ ఫార్మసీ రంగంపై దృష్టి సారించింది. భారీ డిస్కౌంట్స్ తో.. ఫార్మసీ రంగంలో తనదైన ముద్రవేసేందుకు కొత్తగా మెడికల్ ఫార్మసీ కౌంటర్స్ ప్రారంభించనుంది.

దీనికోసం ముందుగా ముంబై నగరంలోని DMart స్టోర్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఫార్మసీ కౌంటర్స్ స్టార్ట్ చేసింది. ఈ డీమార్ట్ మెడికల్స్ స్టోర్లలో ఏకంగా 20శాతం డిస్కౌంట్‌ ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరలో అన్ని డీమార్ట్ స్టోర్లలో మెడికల్స్ కౌంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే.. దీనివల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని.. ఎంఆర్‌పీ ధరలకు మెడిసిన్స్ విక్రయించే రిటైల్ మెడికల్ షాపులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటున్నారు.

ఇప్పటికే.. చైన్ సూపర్ మార్కెట్స్ తో అన్ని ప్రాంతాల్లో తనదైన ముద్ర వేసుకున్న డీమార్ట్.. ఇప్పుడు ఫార్మా రంగంలో కూడా అడుగుపెడుతుండటం సంచలనంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us