AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఇంకా వడ్డీ జమ కాలేదా..? కారణం ఇదే కావొచ్చు.. ఒక్కసారి ఈ పని చేయండి..

ఈపీఎఫ్ఓ అందరి ఖాతాల్లో పీఎఫ్ వడ్డీని జమ చేసింది. అయితే కొంతమందికి ఇంకా పడకపోవడంతో ఆందోళన చెందుతున్నాయి. అయితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరగదని అంటున్నారు. ఆలస్యమైనా ఆటోమేటిక్‌గా అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఇంకా వడ్డీ జమ కాలేదా..? కారణం ఇదే కావొచ్చు.. ఒక్కసారి ఈ పని చేయండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 29, 2026 | 4:08 PM

Share

మీకు ఇంకా పీఎఫ్ వడ్డీ జమ కాలేదా..? ఎందుకు పడలేదని ఆలోచిస్తున్నారా..? పడిందో.. లేదో ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదా..? అయితే ఇది మీ కోసమే. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ నెల 15వ తేదీకి అందరి అకౌంట్లలో పీఎఫ్ వడ్డీని జమ చేసింది. ఇప్పటికే దాదాపు అందరి అకౌంట్లలో వడ్డీ పడగా.. పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసుకున్నారు. అయితే ఇంకా కొంతమంది పీఎఫ్ వడ్డీ పడలేదని ఆందోళన చెందుతున్నారు. అయితే పీఎఫ్ వడ్డీ పడకపోతే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆలస్యంగా జమ అయినా ఎలాంటి నష్టం జరగదని అంటున్నారు. అయితే ఆలస్యంగా జమ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటి అనేది ఒకసారి చూద్దాం.

వడ్డీ రాకపోవడానికి కారణాలేంటి..?

ఒకేసారి అందరి అకౌంట్లను ప్రాసెస్ చేయడం, సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడేషన్‌తో పాటు సిస్టమ్ ఆడిట్ చేపట్టడం కష్టతరమైన పని. అందుకే అందరికీ ఒకేసారి వడ్డీని జమ చేయడం సాధ్యం కాని పని. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది అకౌంట్లలో జమ కాకుండా ఉండే అవకాశముంది. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యమైన ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా వడ్డీ అనేది జమ అవుతుంది. వడ్డీ ఆలస్యంగా జమ అయినా మీరు ఒక్కరూపాయి కూడా నష్టపోరు. ఎందుకంటే ప్రతీ నెలా మీ అకౌంట్లోని బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. వీటిని ఆర్ధిక సంవత్సరం చివరిలో అకౌంట్లలో జమ చేశారు. దీని వల్ల మీకు ఆలస్యంగా జమ అయినా నష్టం అనేది ఉండదు. మీరు పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసినా లేదా అడ్వాన్స్ ద్వారా కొంత మొత్తంలో తీసుకున్నా అప్పటివరకు ఉన్న నగదుకు రావాల్సిన వడ్డీని లెక్కించి జమ చేస్తారు.

వడ్డీ పడిందా..? లేదా? అనేది ఎలా చెక్ చేసుకోవాలి..?

ఈపీఎఫ్ పాస్ బుక్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యూఏఎన్, పాస్ వర్డ్, క్యాప్చాతో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఇక ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి ఈపీఎఫ్ఓ సర్వీసెస్ ఎంచుకోవాలి. అనంతరం క్యూ పాస్ బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే రిజిస్టర్డ్ నంబర్ నుంచి 9966044425కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర