AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరతరాలుగా వంటిట్లో నిలిచినా వంటకం ఇదే.. 365 రోజులు నిల్వ ఉండే ఏకైక పచ్చడి (పక్కా కొలతలతో)

ఈ టెక్నాలజీ కాలంలో చాలా మంది వంట చేయడమే మానేశారు. అలాంటి వాళ్లు ఈ పచ్చడిని ఒకసారి పెట్టుకుంటే ఏడాది పాటు తినొచ్చు. మరి ఈ పచ్చడి ఏంటి? దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 29, 2026 | 5:02 PM

Share
ఈ టెక్నాలజీ కాలంలో చాలా మంది వంట చేయడమే మానేశారు. అలాంటి వాళ్లు ఈ పచ్చడిని ఒకసారి పెట్టుకుంటే ఏడాది పాటు తినొచ్చు. మరి ఈ పచ్చడి ఏంటి? దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

ఈ టెక్నాలజీ కాలంలో చాలా మంది వంట చేయడమే మానేశారు. అలాంటి వాళ్లు ఈ పచ్చడిని ఒకసారి పెట్టుకుంటే ఏడాది పాటు తినొచ్చు. మరి ఈ పచ్చడి ఏంటి? దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

365 రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి (పక్కా కొలతలతో) కావాల్సిన పదార్థాలు: 3 కిలోల పండిన ఎర్రటి టమాటాలు, 
పావుకిలో చింతపండు, 250 గ్రాములు ఉప్పు, 250 గ్రాముల కారం పొడి,  రెండు టేబుల్ స్పూన్స్ పసుపు ,  రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు , ఇంకా మూడు టేబుల్ స్పూన్స్  ఆవాలను తీసుకోవాలి.

365 రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి (పక్కా కొలతలతో) కావాల్సిన పదార్థాలు: 3 కిలోల పండిన ఎర్రటి టమాటాలు, పావుకిలో చింతపండు, 250 గ్రాములు ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు , ఇంకా మూడు టేబుల్ స్పూన్స్ ఆవాలను తీసుకోవాలి.

2 / 5
365 రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి తాలింపుకు ఇవి తీసుకోవాలి:  ఒక కప్పు నువ్వుల నూనె, విడిగా రెండు టేబుల్ స్పూన్స్  ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు , రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు , 150 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు,  10 ఎండుమిర్చి, 
10 కరివేపాకు రెమ్మలు, ఒక టేబుల్ స్పూన్ ఇంగువను తీసుకోవాలి.

365 రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి తాలింపుకు ఇవి తీసుకోవాలి: ఒక కప్పు నువ్వుల నూనె, విడిగా రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు , రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు , 150 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, 10 కరివేపాకు రెమ్మలు, ఒక టేబుల్ స్పూన్ ఇంగువను తీసుకోవాలి.

3 / 5
ముందుగా టమాటాలను కడిగి వాటినితుడిచి తేమ లేకుండా ముక్కలుగా కోసి దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి కనీసం 10 గంటలు అలా ఉంచాలి. ఆ తరువాత చిన్న పాత్రలో వేసి మీడియం మంటపై నీరు మొత్తం పొయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి.
ఇంకా చింతపండును కూడా నానబెట్టి గుజ్జు తీసి దీనిలో కలపాలి.

ముందుగా టమాటాలను కడిగి వాటినితుడిచి తేమ లేకుండా ముక్కలుగా కోసి దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి కనీసం 10 గంటలు అలా ఉంచాలి. ఆ తరువాత చిన్న పాత్రలో వేసి మీడియం మంటపై నీరు మొత్తం పొయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఇంకా చింతపండును కూడా నానబెట్టి గుజ్జు తీసి దీనిలో కలపాలి.

4 / 5
ఇంకా ఇది చిక్కబడే వరకు 20 నిమిషాల పాటు మంచిగా ఉడికించి. ఆ తరవాత దీనిలో కారం పొడి కూడా వేసి కలపాలి. ఇంకా ఈ మెంతులు, ఆవాలను వేయించి చల్లారాక పొడి కలపాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఆయిల్ చేసి తాలింపు పెట్టాకా దీనిని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని పచ్చడిలో కలపాలి. ఇంకా గాజు సీసాను కడిగి పూర్తిగా ఎండబెట్టి ఈ ;పచ్చడి పెడితే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

5 / 5
Follow Us