పుట్టగొడుగుల గురించి తెలిస్తే ఇపుడే తినేస్తారు..అద్భుత ప్రయోజనాలు..!
29 July 2026
Jyothi Gadda
శాకాహారులకు మాంసకృత్తులు అందించే అద్భుతమైన ప్రత్యామ్నాయాలలో పుట్టగొడుగులు మొదటి వరుసలో ఉంటాయి. తక్కువ కేలరీలు, అధిక పోషకాలు ఉండేవి పుట్టగొడుగులు.
మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించడమే కాకుండా పలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పుట్టగొడుగులలో బీటా-గ్లూకన్ అనే ప్రత్యేక పీచు పదార్థంతో పాటు సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్తకణాల పనితీరును మెరుగుపరిచి ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
వీటిలో ఉన్న పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను తగ్గించే కాంపౌండ్స్ ఉండటం వల్ల ధమనుల్లో ఫ్లేక్ పేరుకుపోకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శాకాహారంలో విటమిన్ D లభించే కొన్ని కొన్ని సహజమైన ఆహారాలలో పుట్టగొడుగులు ముఖ్యమైనవి. ఇవి సూర్యరశ్మిని గ్రహించి విటమిన్ D ను నిల్వ చేసుకుంటాయి, ఇది ఎముకల బలానికి ఎంతో అవసరం.
పుట్టగొడుగులలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ప్రీబయోటిక్‌గా పనిచేసి కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి బరువు తగ్గడానికి దోహదపడతాయి.
క్యాన్సర్ నివారణ, చర్మ సంరక్షణ:వీటిలో ఉండే ఎర్గోథియోనీన్, సెలీనియం వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణాల దెబ్బతినకుండా చూస్తాయి, ఇది క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.
అలాగే కాపర్, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. పుట్టగొడుగులు కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ది బెస్ట్! వీటిని సూప్‌లు, కూరలు లేదా సలాడ్‌ల రూపంలో రోజూ తీసుకోవడం మంచిది.