AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer: క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

Cancer Research: క్యాన్సర్, మధుమేహం, వాపు వంటి వ్యాధులకు సహజ పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు డాండెలైన్, గ్రావియోలా, వార్మ్‌వుడ్ వంటి మూలికలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇవి ఇంకా ప్రయోగశాల దశలోనే ఉండగా, వైద్యుల సలహా లేకుండా ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cancer: క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
Anti Cancer Plants
Rakesh
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 5:11 PM

Share

సాంప్రదాయ మూలికలలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్, మధుమేహం, వాపు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా ప్రాచీన కాలం నుంచి వాడుతున్న సాంప్రదాయ మూలికలు, మొక్కలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. పచ్చని ప్రకృతిలో దాగి ఉన్న సహజ సమ్మేళనాలతో భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులకు అద్భుతమైన మందులు తయారు చేయొచ్చని వారు భావిస్తున్నారు. ఈ దిశగా జరుగుతున్న ప్రయోగాలు ఇప్పుడు వైద్య రంగంలో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్, వాపు, జీవక్రియ రుగ్మతలకు చెక్ పెట్టేందుకు డాండెలైన్ వేర్లు, గ్రావియోలా ఆకులు, వార్మ్ వుడ్ వంటి మొక్కలను పరిశోధకులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వార్మ్ వుడ్ నుంచి తీసే ఆర్టెమిసినిన్ ఇప్పటికే మలేరియా చికిత్సలో కీలకంగా మారింది. డాండెలైన్ వేర్ల నుంచి తీసిన రసం క్యాన్సర్ కణాలను ఎలా అడ్డుకుంటుందో ప్రయోగశాలల్లో విశ్లేషిస్తున్నారు.

అలాగే గ్రావియోలా ఆకులు సహజంగా క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయన్న వాదనలపై లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో క్యాన్సర్ కణాలను అంతం చేసే శక్తి ఈ మూలికలకు ఉందా అనే కోణంలో అధ్యయనాలు సాగుతున్నాయి. వీటితో పాటు బ్లాక్ సీడ్, క్యాట్స్ క్లా అనే ప్రత్యేకమైన మొక్కలను శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చాగా పుట్టగొడుగులు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సీ బక్థార్న్ మొక్కల ఔషధ గుణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మొక్కల్లోని సహజసిద్ధమైన రసాయనాలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అంచనా వేస్తున్నారు. అనారోగ్య కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి వీటికి ఉందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ సమ్మేళనాలు శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, మెటబాలిక్ సమస్యలకు చెక్ పెడతాయని భావిస్తున్నారు. అయితే, ఈ పరిశోధనలన్నీ ఇంకా ప్రయోగశాల దశలోనే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంతువులపై, టెస్ట్ ట్యూబ్ లలో మాత్రమే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మనుషులపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కొన్ని మూలికలు నేరుగా వాడితే నరాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

కాబట్టి, ప్రస్తుతానికి ఈ మొక్కలు నేరుగా వ్యాధులను నయం చేస్తాయని గానీ, వైద్యుల చికిత్సకు ఇవి ప్రత్యామ్నాయం అని గానీ భావించకూడదు. డాక్టర్ల సలహా లేకుండా ఇలాంటి మూలికలను సొంతంగా వాడటం శ్రేయస్కరం కాదు. ప్రస్తుత మెడికల్ ట్రీట్ మెంట్ కు బదులుగా వీటిని వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఈ మొక్కల నుంచి తీసిన సమ్మేళనాలు భవిష్యత్తులో అద్భుతమైన మందుల తయారీకి పునాది వేస్తాయనడంలో సందేహం లేదు. ఆధునిక వైద్యానికి ప్రకృతి తోడైతే, రాబోయే రోజుల్లో క్యాన్సర్ లాంటి మహమ్మారిని సులభంగా జయించవచ్చని ఆశిద్దాం.

Follow Us
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
365 రోజులు నిల్వ ఉండే ఏకైక పచ్చడి (పక్కా కొలతలతో)
365 రోజులు నిల్వ ఉండే ఏకైక పచ్చడి (పక్కా కొలతలతో)
నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారం.. సూపర్ కాంబినేషన్..
నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారం.. సూపర్ కాంబినేషన్..
రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా.. 
శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా.. 
ఈ 5 మొక్కలు నాటితే శుభం.. వాస్తు ప్రకారం ఇంటికి సానుకూల శక్తి,..
ఈ 5 మొక్కలు నాటితే శుభం.. వాస్తు ప్రకారం ఇంటికి సానుకూల శక్తి,..
HIV బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానానికి కర్నాటక
HIV బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానానికి కర్నాటక
సొరకాయతో అదిరిపోయే హల్వా.. చల్లటి వెదర్లో క్రీమీ డెజర్ట్..
సొరకాయతో అదిరిపోయే హల్వా.. చల్లటి వెదర్లో క్రీమీ డెజర్ట్..
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?.
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?.