రాకేష్ రెడ్డి చాపల, టీవీ9 తెలుగులో పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. మొదట సాక్షి మీడియా గ్రూపులో పనిచేసిన రాకేష్… గత 12 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తారు . దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. 2014 – 15 సంవత్సరాలలో రెండు NT అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ అనేక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందుకున్నారు.