విమాన ప్రయాణికులకు అలర్ట్..! ధరలు పెంచేసిన భారత అతిపెద్ద విమానయాన సంస్థ!
భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ విధించింది. మార్చి 14 తెల్లవారుజామున 12:01 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం, పశ్చిమాసియా లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల తీసుకున్నారు.

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో దేశీయ, అంతర్జాతీయ ఫ్లైట్స్ పై ఫ్యూయల్ సర్‌ఛార్జ్ విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త చార్జ్ మార్చి 14 తెల్లవారుజామున 12:01 నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న జియోపాలిటికల్ టెన్షన్స్, ఇరాన్‌తో ఉన్న వివాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, విమాన ఫ్యూయల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో తెలిపింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం, ఈ ప్రాంతంలో జెట్ ఫ్యూయల్ ప్రైస్ 85 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) విమానయాన సంస్థలకు అతిపెద్ద ఆపరేటింగ్ ఖర్చు కావడంతో ధరల పెరుగుదల నేరుగా విమానయాన వ్యయాలను ప్రభావితం చేస్తుంది. ప్రతి సెక్టార్ (ప్రయాణంలోని ఒక భాగం) కు కొత్త ఫ్యూయల్ చార్జ్ విధించబడుతుందని ఇండిగో తెలిపింది. దూరాన్ని బట్టి ఈ ఛార్జ్ మారుతుంది.
- డొమెస్టిక్, ఇండియన్ సబ్‌కాంటినెంట్ రూ.425
- మిడిల్ ఈస్ట్ రూ.900
- సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా రూ.1,800
- ఆఫ్రికా, వెస్ట్ ఏషియా రూ.1,800
- యూరప్ రూ.2,300
పెరిగిన ఫ్యూయల్ ప్రైసెస్ మొత్తం ప్రభావాన్ని టికెట్ ప్రైస్ పైకి బదిలీ చేస్తే బేస్ ఫేర్ ను గణనీయంగా పెంచాల్సి వస్తుందని ఎయిర్‌లైన్ తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రయాణీకులపై ఒక్కసారిగా భారీ భారం పడకుండా ఉండటానికి పరిమిత ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మాత్రమే విధించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ యాజమాన్యంలోని ఇండిగో వద్ద ప్రస్తుతం 400 కంటే ఎక్కువ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ ఉంది. ఈ విమానయాన సంస్థ 2025 నాటికి సుమారు 124 మిలియన్ ప్యాసింజర్స్ ను రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్ ప్రపంచవ్యాప్తంగా 135 కంటే ఎక్కువ డెస్టినేషన్స్ కు సేవలు అందిస్తోంది. ముడి చమురు ప్రైసెస్ ను నిరంతరం మానిటర్ చేస్తామని, పరిస్థితిని బట్టి భవిష్యత్తులో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ ను సర్దుబాటు చేసే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
