ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
ఒకప్పుడు రెస్టారెంట్ అంటే ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆస్వాదించే వేదిక. కానీ నేడు అది కాస్తా డిజిటల్ స్టూడియోగా మారిపోయింది. ప్లేటులో ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోకముందే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ ఫోటోలతో బిజీ అయిపోతున్నారా.. అయితే వీటికి చెక్ పెట్టేందుకు పలు రెస్టారెంట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం ఏదైనా హోటల్‌కి వెళ్తే అక్కడ సగం మంది తమ ప్లేటులో ఉన్న ఆహార పదార్థాలని ఫోటోలు తీస్తూ కనిపిస్తారు. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే తినడం మొదలుపెడతారు. ఇంకొంతమంది తింటూ మరో చేతిలో ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది కాల్స్ మాట్లాడుతూ తింటూ ఉంటారు. దాదాపుగా ఏ హోటల్ వెళ్ళినా ఇలాంటి దృశ్యాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు దీనికి రివర్స్ ట్రెండ్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న రెస్టారెంట్లు నో ఫోన్ పాలసీని అమల్లోకి తెస్తున్నాయి. ప్రఖ్యాత చెఫ్ గగన్ ఆనంద్ నడిపిస్తున్న మేషాలిన్ స్టార్ట్ అనే థాయిలాండ్ రెస్టారెంట్‌లో ఈ పాలసీ ఇప్పటికే మొదలుపెట్టారు..
ఈ రెస్టారెంట్‌లో ఫోన్ వాడడం నిషేధం. టేబుల్ పైన ఒక బాస్కెట్ పెడతారు. అందులో అందరి ఫోన్లు పెట్టాల్సిందే. బిల్ పే చేసిన తర్వాతే మీ ఫోన్లు తీసుకోవాలి. ఇక్కడే కాదు యూరప్, జపాన్, అమెరికా, ఏషియన్ దేశాల్లోనూ ప్రముఖ రెస్టారెంట్‌లలో ఈ నో ఫోన్ పాలసీని తీసుకొచ్చారు. ఇండియాలోనూ కొన్ని రెస్టారెంట్లు ఇలాంటి బోర్డులు కనిపిస్తాయి. కానీ ఖచ్చితంగా ఈ పాలసీని అమలు చేయడం లేదు. అతి త్వరలో ఇండియాలో కూడా ఈ నో ఫోన్ పాలసీ అమల్లోకి రానుంది.
నో ఫోన్ పాలసీ అంటే రెస్టారెంట్లో ఫోటోలు తీయడం ఫోన్లు వాడడం పూర్తిగా నిషేధం. ఏదైనా అత్యవసర ఫోన్ ఉంటే పక్కకెళ్ళి మాట్లాడుకోవాలి లేదా బయటకెళ్ళి మాట్లాడాలి. కస్టమర్లు ఫోన్లు తీసుకొని రావడం వల్ల ఏం ఆర్డర్ చేస్తున్నారో ఏం తింటున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని చెఫ్‌లు వాపోతున్నారు. ఫ్రెండ్స్ తోనో, కుటుంబ సభ్యులతోనూ కలిసి వచ్చి సంతోషంగా గడపాల్సిన రెస్టారెంట్లలో ఫోన్‌లో వల్ల క్వాలిటీ టైం దెబ్బతింటుందనేది మరో వాదన. ఇకపై మీరు ఇతర దేశాల్లో సందర్శించేటప్పుడు హోటలలో నో ఫోన్ పాలసీ ఉందా చూసుకొని మరి వెళ్ళండి. లేదంటే బిల్లుతో పాటు ఫైన్ తప్పదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
