AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కొండాపూర్‌లో లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సూసైడ్.. పని ఒత్తిడే కారణమా?

సోమవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని తన నివాసంలో 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగిని మృతి చెందింది. పని సంబంధిత ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన వెనుక వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాలను పరిశీలించడానికి దర్యాప్తు ప్రారంభించారు..

Hyderabad: కొండాపూర్‌లో లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సూసైడ్.. పని ఒత్తిడే కారణమా?
Hyderabad Software Engineer Dies By Suicide
Srilakshmi C
|

Updated on: Mar 10, 2026 | 8:57 AM

Share

హైదరాబాద్‌, మార్చి 10: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో పని ఒత్తిడితో సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోండాపుర్ మసిద్ బండ సుమదుర అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న కర్ణాటక కు చెందిన మనుశ్రీ (32) అనే యువతి గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆమె స్నేహితురాలికి ఫోన్ చేశారు.

సోమవారం ఉదయం అపార్ట్మెంట్స్ కు వచ్చిన స్నేహితురాలు తలుపు తియడంతో మనుశ్రీ సిలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. వేంటనే అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us