AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్‌!

Multibagger Stock: ఈ స్టాక్ ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగలేదు. 2025 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు స్టాక్‌పై భారీ అమ్మకాలు జరిగి దాదాపు 24.47% వరకు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు స్టాక్ 31.33% వరకు తగ్గింది. అలాగే..

Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్‌!
Multibagger Stock
Subhash Goud
|

Updated on: Mar 10, 2026 | 8:53 AM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు ఎప్పుడూ తమ సంపదను గణనీయంగా పెంచే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం ఎదురుచూస్తుంటారు. బలమైన ఫండమెంటల్స్‌, అనుకూల పరిశ్రమ వాతావరణం ఉన్న కంపెనీల స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇవ్వగలవు. మార్కెట్‌లో తాత్కాలిక పతనాలు వచ్చినా కూడా ఈ స్టాక్స్ తిరిగి బలంగా పుంజుకుని పెట్టుబడిదారులకు భారీ లాభాలు అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

ఇలాంటి స్టాక్స్‌లో ఇటీవల ఎక్కువగా చర్చకు వచ్చింది ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Authum Investment and Infrastructure Limited). గత కొన్నేళ్లలో ఈ కంపెనీ షేర్ ధర పెట్టుబడిదారులకు భారీ సంపదను సృష్టించింది.

ఇది కూడా చదవండి: లీటరుకు 27.97 కి.మీ వరకు మైలేజ్.. ఈ SUVపై రూ. 1,00,000 వరకు తగ్గింపు!

షేర్ ధర ప్రయాణం:

గత ఆరు సంవత్సరాల్లో ఈ స్టాక్ ధర ఒక్కో షేర్‌కు రూ.6.60 నుంచి ప్రస్తుతం సుమారు రూ.430 వరకు పెరిగింది. అంటే దాదాపు 6,400% వరకు పెరుగుదల నమోదు చేసింది. 2021 మార్చి నుంచి ఈ స్టాక్‌లో బలమైన ర్యాలీ ప్రారంభమై ఇప్పటివరకు కొనసాగుతోంది. మధ్యలో కొన్ని దశల్లో లాభాల బుకింగ్ కారణంగా ధరలో తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రతి సారి స్టాక్ మళ్లీ బలంగా పుంజుకుని కొత్త రికార్డు స్థాయిలను నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్టాక్ రూ.683.50 అనే ఆల్‌టైమ్ హైను కూడా తాకింది.

కంపెనీ వ్యాపారం:

Authum Investment & Infrastructure ఒక NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ). ఇది ప్రధానంగా

* షేర్లు, సెక్యూరిటీస్‌, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు

* పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్

* రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో పెట్టుబడులు

* లోన్స్, అడ్వాన్సులు ఇవ్వడం వంటి ఫండ్-బేస్డ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

పెట్టుబడిపై ప్రభావం:

ఈ స్టాక్ పెరుగుదల పెట్టుబడిదారుల సంపదను గణనీయంగా పెంచింది. 2021 మార్చిలో ఎవరైనా ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు ఉంచి ఉంటే ఆ పెట్టుబడి సుమారు రూ.65 లక్షలుగా మారేది. అయితే ఈ లెక్కల్లో కంపెనీ చేసిన స్టాక్ స్ప్లిట్‌, బోనస్ షేర్ల ప్రయోజనాలు చేర్చలేదు. కంపెనీ 2021 అక్టోబర్‌లో 1:10 స్టాక్ స్ప్లిట్ చేయగా, 2024 జనవరిలో 4:1 బోనస్ షేర్లు ఇచ్చింది.

ఇటీవల స్టాక్‌లో ఒడిదుడుకులు:

అయితే ఈ స్టాక్ ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగలేదు. 2025 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు స్టాక్‌పై భారీ అమ్మకాలు జరిగి దాదాపు 24.47% వరకు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు స్టాక్ 31.33% వరకు తగ్గింది. అలాగే రూ.683.50 ఆల్‌టైమ్ హై నుంచి దాదాపు 37% వరకు కరెక్షన్ కనిపించింది. మొత్తానికి Authum Investment & Infrastructure స్టాక్ గత కొన్నేళ్లలో పెట్టుబడిదారులకు భారీ సంపదను సృష్టించిన మల్టీబ్యాగర్‌గా నిలిచింది. అయితే ఇటీవలి కాలంలో స్టాక్‌లో కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నందున పెట్టుబడిదారులు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా విశ్లేషించడం అవసరమంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: Fuel Prices: వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ రోజు విధ్వంసమేనా..?
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ రోజు విధ్వంసమేనా..?
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..