Fuel Prices: వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Fuel Prices: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. అక్కడ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి..

Fuel Prices Increased: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్ 92 పెట్రోల్‌పై రూ.24 పెంపు తర్వాత లీటర్‌కు రూ.317కు చేరింది. ఇక ఆక్టేన్ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్ ధర రూ.365కు చేరింది. ఇక ఆటో డీజిల్‌పై రూ.22 పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.303కు చేరింది. ఇక సూపర్ డీజిల్‌పై రూ.24 పెరిగింది. ధర పెరిగిన తర్వాత రూ.353కు చేరింది.
అలాగే కిరోసిన్‌పై రూ.13 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్ ధర రూ.195 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర భారీగా పెరిగింది. అక్కడ లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్ ప్రభుత్వం.
Tax Benefits: మిత్రమా.. మార్చి 31 సమీపిస్తోంది! పన్ను ఆదా చేయడానికి ఈ 5 మార్గాల గురించి తెలుసా?
చమురు ధరలపై ట్రంప్ అలర్ట్:
ఇదిలా ఉండగా, చమురు ధరలపై అమెరికా అలర్ట్ అయ్యింది. ధరలను అదుపు చేసేందుకు ట్రంప్ రంగంలోకి దిగారు. చమురు ధరలను అదుపు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఈ చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




