AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతుందంటే..

బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఆగస్టు 6 ఉదయం నమోదైన రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,610కు చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ.100 పెరిగి రూ.2,40,100గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతుండగా, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతుందంటే..
Gold Rate
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2026 | 6:43 AM

Share

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం ఆగస్టు 6 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,45,760 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,33,610 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,40,100 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,33,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,45,910, 22 క్యారెట్ల ధర రూ.1,33,760 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల ధర రూ.1,33,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల ధర రూ.1,33,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760, 22 క్యారెట్ల ధర రూ.1,33,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యాపిల్ నుంచి కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్
యాపిల్ నుంచి కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఇదే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఇదే..
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!