రాత్రిపూట కడుపులో మంట, అసలు సమస్య గ్యాస్ కాదు. నూనె, కారం అధికంగా ఉన్న ఆహారం తిని వెంటనే పడుకోవడం దీనికి ప్రధాన కారణం. పొట్టలోని ఆమ్లం గొంతులోకి రావడం వల్ల మంట వస్తుంది. అల్సర్లు, హెర్నియా వంటి సమస్యలు కూడా దీనికి దారి తీయవచ్చు. రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకుని, 15 నిమిషాలు నడవడం ఉత్తమం.