AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!

మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. జ్వరం ఉందా లేదా తెలుసుకోవడానికి కొలమానంగా భావిస్తాం. అయితే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అందరికీ శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉండదని, సాధారణ ఉష్ణోగ్రతగా భావిస్తున్న 98.6 డిగ్రీలు అందరికీ వర్తించదని అంటున్నారు.

98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!
Average Human Body Temperature Is Too High Says Standford Study
Sharada V
|

Updated on: Nov 04, 2026 | 5:12 PM

Share

మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. జ్వరం ఉందా లేదా తెలుసుకోవడానికి కొలమానంగా భావిస్తాం. అయితే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అందరికీ శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉండదని, సాధారణ ఉష్ణోగ్రతగా భావిస్తున్న 98.6 డిగ్రీలు అందరికీ వర్తించదని అంటున్నారు.

గతంతో పోలిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతోందా?

గతంతో పోలిస్తే ప్రజల సగటు శరీర ఉష్ణోగ్రత తగ్గుతోందని శరీరంలోని ఇందుకు జీవక్రియల వేగం (Metabolic Rate) తగ్గడం కారణమని అంటున్నారు. శరీరంలో వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు జీవక్రియల వేగం పెరిగి దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందనీ గతంతో పోలిస్తే ప్రజల్లో ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు తగ్గడం కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి కారణమని డాక్టర్ పార్సొనెట్ వివరించారు.

మెరుగైన వైద్య సదుపాయాలు కూడా కారణమా?

గత 200 ఏళ్లలో వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి. మెరుగైన వైద్య చికిత్సలు, పరిశుభ్రత, పోషకాహారం, జీవన ప్రమాణాల్లో మార్పులు ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపాయి. మనం నివసించే ఇళ్లలో ఉష్ణోగ్రత, సూక్ష్మజీవులతో మనకు ఉండే సంబంధం, ఆహారపు అలవాట్లు మారడం మరో కారణమని పరిశోధకులు తేల్చారు.

6 లక్షలకు పైగా శరీర ఉష్ణోగ్రతల పరిశీలన

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పార్సొనెట్, ఆమె పరిశోధకుల బృందం స్టాన్‌ఫోర్డ్ హెల్త్ కేర్‌కు వచ్చిన రోగుల శరీర ఉష్ణోగ్రతలను విశ్లేషించారు.  6 లక్షల మంది రోగులకు సంబంధించిన నోటి ద్వారా థర్మామీటర్ తో కొలిచిన ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశీలించారు. వారి వయసు, లింగం, బరువు, ఎత్తు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), వాడుతున్న మందులు, ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో సాధారణ శరీర ఉష్ణోగ్రతలు 36.2 నుంచి 36.8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. అంటే మనం సాధారణంగా అనుకుంటున్న 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కటే అందరికీ వర్తించే ప్రమాణం కాదు.

అందరికీ ఒకే ఉష్ణోగ్రత ఉండదు

వైద్యులతో పాటు ప్రజలు  98.6 డిగ్రీల ఫారన్‌హీట్ నే (36.6 డిగ్రీల సెల్సియస్) ప్రతి ఒక్కరి సాధారణ శరీర ఉష్ణోగ్రతగా భావిస్తున్నారనీ, కానీ వ్యక్తి సాధారణ శరీర ఉష్ణోగ్రత అనేది వారి ఆరోగ్య పరిస్థితి, వయసు, సమయం పై ఆధారపడి మారుతుందన్నారు. ఈ పరిశోధనా ఫలితాలు JAMA Internal Medicine జర్నల్‌లో ప్రచురితమైంది.  ప్రస్తుతం ప్రజలందరికీ వర్తించేలా ఒక కొత్త సగటు ఉష్ణోగ్రతను నిర్ణయించడం సాధ్యం కాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ మార్పులన్నీ మనుషుల శరీర నిర్మాణం, శారీరక ప్రక్రియలపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అందుకే గతంలో ఉన్న శరీర ఉష్ణోగ్రతలనే ఇప్పటికీ అందరికీ వర్తింపజేయడం సరైంది కాదని చెబుతున్నారు.

భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు

శరీర ఉష్ణోగ్రత ఆధారంగా జ్వరాన్ని ఎలా గుర్తించాలి? సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రత నిరంతరం ఉండటం ఆయుష్షుపై ప్రభావం చూపుతుందా?  వీటిపై భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే, 36.6 డిగ్రీల సెల్సియస్ అనేది అందరికీ వర్తించే సాధారణ శరీర ఉష్ణోగ్రత కాదని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే ఈ పరిశోధన ఆధారంగా జ్వరాన్ని గుర్తించే వైద్య ప్రమాణాలు మారినట్లు భావించకూడదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఉష్ణోగ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది.

Follow Us