ఆత్రేయపురంలో ముగ్గురు వ్యక్తులు ఒక ఆవుపై దారుణానికి పాల్పడ్డారు. నవంబర్ 2న వాడపల్లి లంకలో కట్టేసి ఉన్న ఆవును చిత్రహింసలు పెట్టి చంపేశారు. స్థానికులు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.