రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోక్సో కోర్టులో ఓ మహిళా కానిస్టేబుల్ దీప తన మానవత్వాన్ని చాటుకున్నారు. విచారణకు వచ్చిన బాధితురాలి బిడ్డను ఆమె అమ్మలా లాలించి, ఇన్-కెమెరా విచారణ పూర్తయ్యే వరకు బయటే చూసుకున్నారు. దీప చొరవను న్యాయవాదులు, పోలీసులు అభినందించారు.