AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై.. ఇలా చేస్తే తినని వారు కూడా రెండు కంచాలు పక్కా

తెలంగాణ వంటకాల్లో నల్లకూర ఫ్రైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన వంటకమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తే నల్లకూర తినని వారు కూడా ఇష్టపడి తింటారు. దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Prasanna Yadla
|

Updated on: Nov 03, 2026 | 5:05 PM

Share
తెలంగాణ వంటకాల్లో నల్లకూర  ఫ్రైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన వంటకమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది.   ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తే  నల్లకూర తినని వారు కూడా ఇష్టపడి తింటారు.  దీనికి కావాల్సిన పదార్దాలు,  ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నల్లకూర ఫ్రైలో పచ్చి వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రపరిచే విధానం చాలా ముఖ్యం. ముందుగా, రెండు నిమిషాల పాటు నీటిని బాగా మరిగించి, ఆపై గోరువెచ్చగా చల్లారనివ్వాలి. ఈ నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, మరియు నిమ్మకాయ రసం పిండాలి. ఆ తర్వాత మేక రక్తాన్ని ఈ నీటిలో వేసి బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల రక్తం నుంచి వచ్చే ఎలాంటి నీచు వాసనా పోతుంది. బాగా కడిగిన తర్వాత, రక్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయడం వల్ల మసాలాలు బాగా పట్టి, రుచి పెరుగుతుంది.

2 / 5
స్టవ్ మీద పాన్ పెట్టి, రెండు గరిటెల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత, ఒక నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, కొద్దిగా గసగసాలు వేసి వేయించాలి.తర్వాత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. కొద్దిగా పసుపు, శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలి.

3 / 5
 ఇప్పుడు, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నల్లకూరను పాన్ లో వేయాలి. అన్నింటినీ బాగా కలిపి, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల నల్లకూరలో ఉన్న తేమ బయటకు వచ్చి, మసాలాలు బాగా పడతాయి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం వేయాలి. ఇక్కడ నిమ్మకాయ రసం పోయడం వల్ల రుచి వస్తుంది.

4 / 5

అన్నింటినీ బాగా కలిపి, మళ్లీ మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. ఈ సమయంలో నల్లకూర బాగా ఫ్రై అయ్యి, మసాలాలు ముక్కలకు పట్టి రుచిని అందిస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి, ఒక చెంచా ధనియాల పొడి చల్లి, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి.

5 / 5
Follow Us