బొబ్బట్లను వత్తడానికి బట్టర్ పేపర్ లేదా ఆయిల్ ప్యాకెట్/మిల్క్ ప్యాకెట్‌ను ఉపయోగించవచ్చు. ఎంచుకున్న పేపర్‌కు కొద్దిగా నెయ్యి పూసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండి నుంచి చిన్న ముద్దను తీసుకుని, చేతితో కొంచెం మందంగా వత్తి, మధ్యలో పూర్ణం ఉండను పెట్టి అన్ని వైపుల నుండి మూసేయాలి. అదనపు పిండిని తీసేసి, పూర్ణం బయటకు రాకుండా చూసుకోవాలి. పిండి మూసిన భాగాన్ని కిందకు ఉంచి, చేతికి నెయ్యి రాసుకుని, నెమ్మదిగా పల్చగా వత్తుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ వత్తితే ఈజీగా వస్తుంది.బొబ్బట్లను కాల్చడానికి, పెనాన్ని బాగా వేడి చేసి, మీడియం మంటపై ఉంచండి. బొబ్బట్టును పేపర్‌తో సహా పెనంపై వేసి, నెమ్మదిగా పేపర్‌ను తీసివేయాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత తిప్పి, రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. మంటను మీడియంలో ఉంచడం వల్ల బొబ్బట్లు మాడిపోకుండా చక్కగా కాలుతాయి. ఈ విధంగా అన్ని బొబ్బట్లను కాల్చుకోవాలి.