AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి ఎమోషనల్ జర్నీ.. పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !

అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. కాగా గత రెండు వారాల్లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి ఎమోషనల్ జర్నీ.. పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !
Sudheer Reddi
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2026 | 5:06 PM

Share

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఆకట్టుకుంటోంది. దశావతారం థీమ్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్, ప్రస్తుతం తొమ్మిదో వారానికి చేరుకుంది. హాట్ హాట్‌గా సాగుతున్న నామినేషన్లతో హౌస్‌లో కాకరేగుతుండగా, మరోవైపు కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ సుధీర్ రెడ్డి తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, వైవాహిక బంధంలోని సమస్యలను బయటపెట్టి తోటి పోటీదారులతో పాటు ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించాడు. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల ఫొటోలను చూపిస్తూ, వారి జీవితంలోని అనుబంధాలను గుర్తుచేసే ఒక ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఫొటోను చూసిన సుధీర్ రెడ్డి, జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నాడు. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పెళ్లి తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయని వెల్లడించాడు.

తాను మనుషులను అతిగా నమ్ముతానని, అదే తన అతిపెద్ద బలహీనత అని సుధీర్ పేర్కొన్నాడు, నమ్మినవారే తనను పలుమార్లు మోసం చేశారని తెలిపాడు. ముఖ్యంగా తన జీవితంలోకి వచ్చే వ్యక్తులు తన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారని భావించానని, కానీ అది జరగలేదని బాధపడ్డాడు. పెళ్లికి ముందే ఇల్లు కొనాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో వివాహ ఏర్పాట్లు ప్రారంభం కావడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. ఒకవైపు హోమ్ లోన్ ప్రక్రియలు, మరోవైపు పెళ్లి ఖర్చులు చూసి తన తల్లిదండ్రులు పడిన ఇబ్బందులు తనను కలచివేశాయని చెప్పాడు. ఆ సమయంలో అసలు పెళ్లి చేసుకోవడం అవసరమా అనే భయం కూడా తనకు కలిగిందని ఆయన గుర్తుచేసుకున్నాడు. పెళ్లి తర్వాత జీవితం అనుకున్నట్లుగా సాగలేదని సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. ఇతరులతో తనను పోల్చి అవమానించే మాటలు వినాల్సి వచ్చిందని, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నా జీవితం నాశనమైంది అంటూ భార్య అన్న మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపాడు. కెరీర్ పరంగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ ను నిలబెట్టుకుంటూనే, కష్టపడి సంపాదించిన డబ్బును కుటుంబం కోసమే ఖర్చు చేశానని చెప్పాడు.

మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని, కొంతకాలానికి తిరిగి వస్తుందని ఆశపడినా చివరకు ఆమె అమెరికా వెళ్లిపోవడంతో తాను పూర్తిగా ఒంటరినయ్యానని, మానసికంగా ఎంతో కుంగిపోయానని సుధీర్ కన్నీరు పెట్టుకున్నాడు. తన జీవితం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పటికీ, ఇతరులకు సాయం చేయడంలో తాను ఎప్పుడూ వెనుకాడలేదని సుధీర్ స్పష్టం చేశాడు. ఓ మహిళ కుమార్తెల చదువు కోసం ఏడాది పాటు స్కూల్ ఫీజులు చెల్లించానని, వైజాగ్‌లో ఓ వృద్ధురాలికి బాసటగా నిలిచానని తెలిపాడు. అంతేకాకుండా అత్యవసర సమయంలో కేవలం 24 గంటల్లోనే ఒకరికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టుకుంటూ జీవితంలో స్థిరపడాలని చూస్తున్న సమయంలో ఎదురైన ఈ పరిణామాలు ప్రోమోలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us