లెజెండ్ సినిమాలోని తన పాత్ర, వయసులో పెద్దవారితో రొమాన్స్ చేయడంపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా కథ, యాక్షన్ సీక్వెన్స్‌లపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో ఎందుకు నిరాకరించలేదని, బాలీవుడ్ ఇమేజ్ కోసం సౌత్ సినిమాలను బలిచేయడం సరైనదేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.