November 2, 2026
Subhash
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఆన్‌లైన్ పరీక్ష పాస్ మార్కుల నుంచి లైసెన్స్ ఫీజుల వరకు మార్పులను చేస్తోంది.
సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన పరీక్షలో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న పాస్ మార్కులను 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
డ్రైవింగ్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఆన్‌లైన్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు ఉండాలని ప్రతిపాదించారు.
లైసెన్స్‌లో పేరు, చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేస్తే అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా వెల్లడించాలి.
ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందే కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. పేరు, చిరునామా మార్పులకూ ఛార్జీలు తొలగించే ఆలోచనలో ఉంది
గుర్తింపు, వయసు, చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రాలు, విద్యా సర్టిఫికెట్లు, ఈ-రేషన్ కార్డులను అనుమతించాలని ప్రతిపాదించారు.
గత 3 నెలల్లో జారీ అయిన విద్యుత్, గ్యాస్ బిల్లులను చిరునామా ధ్రువీకరణకు అనుమతించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అదే సమయంలో ఎల్‌ఐసీ పాలసీలను ఈ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించారు.
రెన్యువల్ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లను లామినేటెడ్, పీవీసీ కార్డులను ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై 30 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.